Raima Sen: బెదిరింపులకు తాళలేకపోతున్న ప్రముఖ హీరోయిన్..!

Raima Sen : సాధారణంగా సోషల్ మీడియా సెలబ్రిటీలు అన్నాక ట్రోల్స్ ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది ఆకతాయి నెటిజన్స్.. డ్రెస్సింగ్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు ఇలా ప్రతి పనిలో ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ విమర్శలతో హద్దులు దాటుతూ ఉంటారు.. అయితే ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్ కి కొంతమంది తమదైన శైలిలో రియాక్ట్ అయితే మరి కొంతమంది సైలెంట్ గా ఉండిపోతారు..

బాలీవుడ్ హీరోయిన్ కి బెదిరింపులు..

అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం తన బాధను సోషల్ మీడియాలో వెళ్లి బుచ్చుకుంటూ మరింత ఎమోషనల్ అవుతోంది..తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రైమా సేన్.. గత కొద్దిరోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ వాపోతోంది. ఇంట్లోని ల్యాండ్ లైన్ కి కాల్ చేసి మరీ బెదిరిస్తున్నారని.. ఆ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..

బెదిరింపులకు కారణం..

ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే రైమా సేమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మా కాళీ”.. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన దారుణమైన హత్యకాండ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయగా అప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వాపోతోంది రైమాసేన్..

- Advertisement -

ఇదిలా ఉండగా రైమా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో జీవిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రైమాసేన్ మాట్లాడుతూ.. నేను ఆశ్చర్యపోయాను.. ఎందుకంటే ఒక సినిమా కోసం ఇలాంటి బెదిరింపులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.. హిందీ , బంగ్లా భాషలలో నన్ను పూర్తిస్థాయిలో బెదిరిస్తున్నారు.. ముందు సినిమా చూసి అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి.. కానీ ఇప్పుడే ఎందుకు నన్ను విమర్శిస్తున్నారు. మా ఖాళీ సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు.. లెజెండ్రీ నటి సుచిత్రాసేన్ మనవరాలు అయ్యి ఉండి ఇలాంటి సినిమాలు చేయడానికి ఎలా అంగీకరించావు అంటున్నారు.. మరికొంతమంది నువ్వు ఎప్పటికైనా కోల్కతాలో ఉండాల్సి వస్తుందని అంటున్నారు… అసలు నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు.. వాస్తవానికి నేను ఎప్పుడు వివాదాలకి దూరంగానే ఉంటాను.. అలాంటి నన్ను ఇప్పుడు ట్రోల్లింగ్ కి గురి చేస్తూ..ఫోన్లు చేసి బెదిరించడం ఎంత మాత్రం కరెక్టు అంటూ ఆమె ప్రశ్నిస్తోంది.. ప్రస్తుతం నేను నా కుటుంబంతో కలిసి కోల్కతాలో ఉంటున్నాను.. కానీ ఈ బెదిరింపు కాల్స్ నా తల్లిదండ్రుల మనసులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతమైంది రైమా సెన్…

సినిమా చూడకుండానే ఇలా బెదిరించడం చాలా అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. ఒక నటిగా ఎలాంటి పాత్రలోనైనా నటించాలి.. పాత్ర నచ్చితే ఏ సినిమా చేయడానికి అయినా అంగీకరిస్తాము.. కానీ ఇప్పుడు మా కాళీ సినిమా అనవసరంగా వివాదంగా మారుస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది ..ఇకపోతే రైమా తెలుగులో నితిన్ కి జోడిగా ధైర్యం అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం మా కాళీ పోస్టర్ వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు