Nayan – Vighnesh : ఈ కోలీవుడ్ జంట పెళ్లి ఆయన వల్లే జరిగిందా..?

Nayan – Vighnesh : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార – విగ్నేష్ జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2015 లో నయనతార హీరోయిన్గా నటించిన “నానుమ్ రౌడీ ధాన్” అనే సినిమాకి విఘ్నేష్ దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి ఆమె అభిమాని అయిపోయారు విఘ్నేష్. ఇదే సినిమాను తెలుగులో ” నేను రౌడీ ” అనే టైటిల్ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత కొంతకాలానికి ప్రేమగా మారి.. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలేలా చేసింది.. ఇక తర్వాత ఈ జంట ఎట్టకేలకు 2022 జూన్ 9న వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అదే ఏడాది సరోగసి ద్వారా ఉయిర్ , ఉలగం అనే ఇద్దరు కుమారులకు వీరు తల్లిదండ్రులు అయ్యారు.

నయన్ – విఘ్నేష్ పెళ్లికి కారణం ధనుషే..

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ఒక స్టార్ హీరో కారణమని చెబుతున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. నానుమ్ రౌడీధాన్ అనే సినిమా కథ నయనతారకు చెప్పమని ధనుష్ సూచించారు.. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పిన విజయ్ సేతుపతి ఇందులో నయనతార నటిస్తోందని చెప్పగానే.. తాను కూడా ఆలోచించకుండా సంతకం చేశారు.. ఈ సినిమా వల్ల నయనతారకు ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది..అలా తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాము ఒకరకంగా మా ప్రేమకు ధనుష్ కారణమయ్యారు అంటూ విఘ్నేష్ చెప్పుకొచ్చారు.. ఇకపోతే నానుమ్ రౌడీ ధాన్ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే .. ఇక అలా నిర్మాతగా ఆ సినిమా కోసం వచ్చిన ధనుష్.. ఆ తర్వాత వీరి ప్రేమకు వారధిగా మారారు.

వివాహం తర్వాత వరుస వివాదాలు..

వీరిద్దరూ వివాహం జరిగిన ఆరు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అవడంతో రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.. అంతే కాదు వివాహమైన కొత్తలో చెప్పులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వెళ్లడంతో అక్కడ కూడా వివాదంలో చిక్కుకుంది నయనతార.. అంతేకాదు ఇటీవల ఈమె నటించిన అన్నపూరణి సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైనా.. కొన్ని కారణాల వల్ల ఓటీటీ నుంచి తీసివేశారు. అంతేకాదు గతంలో విఘ్నేష్ శివన్, నయనతార కూడా కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే వీరి వివాహం తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కోవడమే కాదు వివాదాలలో కూడా చిక్కుకున్నారు.. ఇకపోతే ప్రస్తుతం అటు నయనతార ఇటు విగ్నేష్ ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల నయనతార కూడా జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ అందుకొని రూ .11 కోట్ల పారితోషకంతో సౌత్ ఇండియా ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా చలామణి అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు