Indian 2 Release Date : మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటి సామి

Indian 2 Release Date : సౌత్ ఇండియాలో రాబోయే పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇండియన్ 2 కూడా ఒకటి. ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం రాకున్నా.. చాలా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో… 1996లో వచ్చిన ఇండియన్ కు ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఈజీగా పెరిగిపోయాయి. ఈ సీక్వెల్‌ను డైరెక్టర్ శంకర్ ఎలా తెరకెక్కించబోతున్నాడు..? కమల్ హాసన్‌ను ఎలా చూపించబోతున్నాడు..? అంటూ చాలా ప్రశ్నలు ఆడియన్స్‌లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఎదురుచూపులు ఉన్నాయని చెప్పొచ్చు.

అయితే రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనే ఓ టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అనుకున్నట్టు గానే మూవీ నుంచి అప్డేట్ ఉండబోతుంది అంటూ లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీంతో ఇండియన్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కూడా అనుకన్నట్టే రిలీజ్ డేట్ చెప్పేశారు.. కాదు.. కాదు.. రిలీజ్ మంత్ మాత్రమే చెప్పారు.

రిలీజ్ అనౌన్స్‌మెంట్…

ఇండియన్ 2 మూవీని ( Indian 2 Release Date ) ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని లైకా ప్రొడక్షన్ వాళ్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాను ఈ డేట్‌న రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ అనౌన్స్ చేయడం ఎప్పుడూ జరిగేదే. కానీ, రిలీజ్ డేట్‌ దాచేస్తూ… రిలీజ్ మంత్ మాత్రమే చెప్పడమే ఏంటి అంటూ మూవీ లవర్స్ అంటున్నారు. అంతే కాదు, దీనిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

- Advertisement -

ఇప్పుడు అనౌన్స్‌మెంట్ కేవలం రిలీజ్ నెల వరకే పరిమితం కావడంపై అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫస్ట్ కాపీ రావడం ఇలాంటి ఇంకా ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని అందుకే అనౌన్స్ మెంట్ రిలీజ్ మంత్ వరకే పరిమితం అయ్యారని అంటున్నారు క్రిటిక్స్. ఒక వేళ ఇప్పుడు రిలీజ్ డే అనౌన్స్ చేస్తే, ఎదైనా పనుల వల్ల వాయిదా వేస్తే అప్పుడు వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని శంకర్ అనుకున్నట్టు తెలుస్తుంది.

గేమ్ ఛేంజర్‌లోనూ అదే పరిస్థితి…

ఈ ఇండియన్ 2 విషయంలోనే కాదు, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలోనూ శంకర్ ఇలాంటి ప్లానే వస్తున్నాడు. అయితే ఇండియన్ 2కు కనీసం రిలీజ్ మంత్ అయినా చెప్పాడు. కానీ, గేమ్ ఛేంజర్‌కి మాత్రం అది కూడా లేదు.

ఓ సందర్భంలో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు… “ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అనౌన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ, డైరెక్టర్ శంకర్ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

అంటే… రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు కూడా సైలెంట్‌గా ఉండేలా.. డైరెక్టర్ శంకర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఏది ఏమైనా డైరెక్టర్ల నుంచి అయినా, ప్రొడ్యూసర్ల నుంచి అయినా, అభిమానులు మాత్రం అప్టేట్స్ తో పాటు రిలీజ్ డేట్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ, శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాల విషయంలో మాత్రం అభిమానులకు ఈ రెండు జరగడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు