Dhanush: చెఫ్ కాబోయి హీరో అయ్యాడు.. కష్టం వెనుక కథ ఇదే..!

మొదట్లో కోలీవుడ్ హీరో ధనుష్ ను చూసి చాలామంది నవ్వుకున్నారట.. ఇతడు హీరో ఏంటి రా బాబు అని ఎగతాళి కూడా చేసేవారట.. ఇప్పటి హీరోల లాగా ఫిజిక్ కూడా లేకపోవడంతో ఇతడు హీరో ఏంటి అని నవ్వుకున్న వారికి ధనుష్ ఇప్పుడు ఓ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి అందరి నోళ్ళు మూయించారు.. హీరో అంటే కేవలం సిక్స్ ప్యాక్ బాడీ, హైట్, వెయిట్ అనే సంబంధం లేకుండా కేవలం నటననే నమ్ముకుంటూ ఈ స్థాయికి వచ్చారు హీరో ధనుష్..

ధనుష్ ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలరు.. యాక్షన్ సీన్స్ అయితే పిచ్చెక్కించేలా చేస్తూ ఉంటారు. మాస్ హీరో గా కూడా పేరు సంపాదించారు. తాజాగా ఇప్పుడు ధనుష్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ధనుష్ ఒకవేళ హీరో కాకుండా ఉంటే చెఫ్ అయ్యేవారు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ధనుష్ ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన వంటల ప్రావీణ్యం గురించి తెలియజేశారు.

చిన్నతనం నుంచి ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్ వంటి చిన్నచిన్న వంటకాలు చేసి తన తండ్రికి వడ్డించి మరీ ఆయన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే వారట ధనుష్.. ఒకవేళ తాను హీరో కాకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా ఒక మంచి చెఫ్ అయ్యేవాడినని ధనుష్ ఒక సినిమా ప్రమోషన్స్ లో వెల్లడించారు. అయితే నిజ జీవితంలో చెఫ్ కాలేకపోయినా తనకు రీల్ లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తానంటూ వెల్లడించారు.. తనకు చిన్న వయసు నుంచి వంటలు చేయడం అంటే చాలా ఇష్టమని.. అందుకే వంటలలో ఎన్నో ప్రయోగాలు కూడా చేసే వాడినంటూ తెలిపారు

- Advertisement -

ఇటివలే తెలుగులో కూడా డైరెక్ట్ గా పలు సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు ధనుష్.. ఏడాది సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసి పరవాలేదు అనిపించుకున్నారు ధనుష్.. ఇప్పుడు కూడా సరికొత్త కథాంశాలతో అభిమానులను మెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి చిత్రాలతో అభిమానులను మెప్పిస్తారో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు