Geethanjali2 : మా సినిమా కూడా అదే రోజు వస్తుంది.. చూసేయండి – శ్రీ విష్ణు

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి కథానాయిక గీతాంజలి సీక్వెల్ గా ” గీతాంజలి మళ్ళీ వచ్చింది” పేరుతో తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ లాంచ్ తాజాగా జరిగింది. శ్రీ విష్ణు ఈ టీజర్ లాంచ్ కి గెస్ట్ గా హాజరయ్యారు. టీజర్ గురించి ప్రస్తావిస్తూ మొదట వచ్చిన గీతాంజలి కి మించి ఈ సినిమా ఉండబోతుందని టీజర్ తో తెలిసిపోతుందని అన్నారు.

ఇక కోన వెంకట్ గురించి ప్రస్తావిస్తూ, ఆయనతో వన్ ఇయర్ నుండి క్లోజ్ గా ట్రావెల్ చేస్తున్నాను. సినిమాల గురించి తప్ప ఆయన మరో విషయం మాట్లాడరు. అంత ఇష్టం ఆయనకీ సినిమాలంటే, ఇప్పుడు ఆయన స్క్రీన్ ప్లే ఇస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను అని అన్నాడు. అయితే పనిలో పనిగా తాను నటిస్తున్న ‘ ఓం బూమ్ బుష్’ సినిమాకు కూడా ప్రమోట్ చేసేసుకున్నాడు శ్రీ విష్ణు. ఒక కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా టీజర్ రేపు రిలీజ్ అవుతుంది. ఇక గీతాంజలి 2 మార్చి 22న రిలీజ్ అవుతుందని, అలాగే తాను నటించిన ‘ఓం బూమ్ బుష్’ సినిమా కూడా మార్చి 22న వస్తుందని, తమ సినిమాని కూడా ఆదరించమని కోరుతూ, ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని కలెక్షన్ల వర్షం కురుస్తుందని ఆకాంక్షించాడు.

ఇక హార్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అంజలి 50వ చిత్రంగా తెరకెక్కగా, ఈ సినిమాను 2024 మార్చి 22న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ టీజర్ లో అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ గా నటించగా, సునీల్, అలీ, రవి శంకర్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, బ్రహ్మాజీ, రాహుల్ మాధవ్ కీలకపాత్రల్లో నటించారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు