Dhanush : అల్ రౌండర్ “రాయన్” మాస్..

కోలీవుడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. లాస్ట్ ఇయర్ సార్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో, ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ తో యావరేజ్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పడు శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే వారం రోజుల షెడ్యూల్ ని కూడా పూర్తి చేసిన ధనుష్, ఆ సినిమా కి గ్యాప్ వస్తే మరో సినిమా షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. అయితే తాజాగా ధనుష్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు. అనౌన్స్ చేయడమే కాదు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ కి షాకిచ్చాడు. ఫ్యాన్స్ కి అయితే ఆ ఫస్ట్ లుక్ తో ఒక మాస్ ఫీల్ ఇచ్చాడని చెప్పొచ్చు.

ధనుష్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు “రాయన్” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా, కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. విశేషమేమిటంటే ఈ సినిమాకు ధనుష్ నటించడమే గాకుండా దర్శకత్వం కూడా తానే వహిస్తున్నాడు. కాసేపటికిందటే సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ లో ధనుష్ మాస్ అవతార్ లో సూపర్ గా ఉన్నాడు. వెనకాల ట్రక్ చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది కాబట్టి ధనుష్ ఈ సినిమాలో మెకానిక్ అయి ఉండవచ్చు. పైగా మెకానిక్ డ్రెస్ కూడా వేసుకున్నాడు. ఇక ఆ వెనకాల ట్రక్ పై సందీప్ కిషన్, తమిళ్ నటుడు కాళిదాస్ కూర్చుని ఉన్నారు. బహుశా ఇందులో ధనుష్ ఫ్రెండ్స్ అయి ఉంటారు.

మరి ఈ సినిమా కథాంశం ఏమిటో తెలీదు గాని ఫస్ట్ లుక్ తో మాత్రం ధనుష్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తున్నాడని చెప్పొచ్చు. అయితే ధనుష్ ఇంతకు ముందు కూడా పా పాండి అనే చిత్రం దర్శకత్వం వహించగా, ఆ సినిమా ఆ అంతగా ఆడలేదు. మరి ధనుష్ రెండో సారి దర్శకుడిగా తీస్తున్న రాయన్ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమాపై పూర్తి దృష్టి పెడతాడని తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు