Balakrishna Next : నాని డైరెక్టర్ కు బాలయ్య ఛాన్స్? 

నటసింహం నందమూరి బాలయ్య గత ఏడాది వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ మెయింటైన్ చేస్తూ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే బాలయ్యతో సినిమాలు చేయడానికి పలువురు యంగ్ డైరెక్టర్స్ లైన్ లో ఉండగా, బాలయ్య మాత్రం నాని దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య మెచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు? అంటే…

ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 2023 సంక్రాంతి బరిలో బాలయ్య “వీర సింహారెడ్డి” సినిమాతో, బాబి “వాల్తేరు వీరయ్య” సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడ్డారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రావడం విశేషం. కాగా బాబీ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ మూవీ గురించి ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు.

సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ ఇటీవల బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించడంతో, ఆ మూవీ అల్లు అర్జున్ తో చేయబోతున్నారా, లేదంటే బాలకృష్ణతోనా? అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బోయపాటితో బాలయ్య “అఖండ 2″ను సెట్స్ పైకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు “హనుమాన్” డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండబోతోంది అని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

తాజాగా ఈ లిస్ట్ లో నాని డైరెక్టర్ చేరిపోయారు. నాని, సాయి పల్లవి జంటగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిలిం “శ్యామ్ సింగ రాయ్”. ఈ మూవీకి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యన్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండబోతోందని రూమర్ మొదలైంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల రాహుల్.. బాలయ్యను కలసి ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది కూడా ఓ పిరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్య పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకు రమ్మని చెప్పారని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ కథ నచ్చితే బాలయ్య పూర్తి సిగ్నల్ ఇస్తారని టాక్ నడుస్తోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు