Allu Arjun : బన్నీ కొత్త స్వెట్ షర్ట్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప : ది రైజ్” మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇందులో ప్రదర్శించే సినిమాకు అంతర్జాతీయ ప్రశంసలతో పాటు, మూవీలో నటించిన నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా స్టార్ డం మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బెర్లిన్ కు బయలుదేరిన బన్నీ హైదరాబాద్ లో కెమెరాల కంటికి చిక్కారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో, అల్లు అర్జున్ ఎయిర్ పార్ట్ అవుట్ ఫిట్ హాట్ టాపిక్ గా మారింది. ఆయన ధరించిన బ్లాక్ స్వెట్ షర్ట్ ధర గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎలాగోలా దాని ధర పట్టేసి, సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. ఇంతకీ అల్లు అర్జున్ వేసుకున్న ఆ స్వెట్ షర్ట్ ధర ఎంత? అంటే…

అల్లు అర్జున్ ఎప్పుడూ ట్రెండీ స్టైలిష్ లుక్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ధరించే బట్టల విషయంలో లగ్జరీ తో పాటు కంఫర్ట్ కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఏదైనా ఫిలిం అవార్డు ఫంక్షన్లకు హాజరైనప్పుడు స్టైలిష్ అండ్ కూల్ లుక్ లో ఇతర హీరోల కంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన బుర్బెర్రి మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ లో మరింత స్టైలిష్ గా కనిపించాడు. ఇక దీని ధర ఏకంగా ఒక సామాన్యుడి నెల జీతం కావడం విశేషం. ఈ స్వెట్ షర్ట్ ధర రూ.28,000. మరోవైపు ఈ గ్లోబల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా “పుష్ప 2” షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ ప్రాజెక్ట్ తర్వాత “యానిమల్” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే “పుష్ప 3” కూడా ఉంటుందని బన్నీ తాజాగా ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి చాలా టైం పడుతుందని టాక్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు