Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “పుష్ప”కి ఛాన్స్… బయల్దేరిన బన్నీ

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తనదైన మేనరిజంతో, డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా “పుష్ప” హిట్ వల్ల అల్లు అర్జున్ కు విదేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే మరోసారి అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం “పుష్ప 2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన, షూటింగ్ ను పక్కన పెట్టి బెర్లిన్ బయలుదేరాడు. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప” స్క్రీనింగ్ ఉండడగా, దానికి అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయ్యే అద్భుతమైన అవకాశం దక్కింది “పుష్ప”కు. ఈరోజు నుండి జరగబోతున్న ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి అల్లు అర్జున్ ఉదయం బయలుదేరారు. గురువారం ఆయన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ “పుష్ప : ది రైజ్” బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రదర్శనకు సెలెక్ట్ కాగా, ఈ భారతీయ సినిమాకు అందులో హీరోగా నటించిన అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ ట్రిప్ లో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, బయ్యర్లతో ముచ్చటించనున్నారు. అలాగే స్క్రీనింగ్ అనంతరం అంతర్జాతీయ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొని ఉన్నాడు. అయితే గతంలో “పుష్ప” మూవీని అల్లు అర్జున్ అండ్ టీం రష్యాలో ప్రమోట్ చేసినప్పటికీ, ఈ మూవీ అక్కడ అంతగా ఆడలేదు. రష్యాతో పాటు ఆస్ట్రేలియా, యుఎస్ఏ, గల్ఫ్, యూకే వంటి దేశాల్లో “పుష్ప” సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప” ప్రదర్శన కారణంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పెరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప” ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం “పుష్ప : ది రూల్” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 15న ఈ సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు