Allu Arjun: బన్నీ లైనప్ మామూలుగా లేదుగా..?

Allu Arjun:  అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ చేతిలో మూడు భారీ ఇండియా చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో మొదట ఏ సినిమాని ఆయన ఓకే చేస్తారు అని అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి కథ చెప్పగా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ గతంలో సరైనోడు సినిమాలో కలిసి పనిచేశారు. ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల బోయపాటితో సినిమా చేస్తున్నట్లుగా అల్లు అరవింద్ కన్ఫామ్ చేశారు కానీ హీరో ఎవరన్నది మాత్రం తెలియలేదు. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలవ్వదని సమాచారం.

అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక అట్లీ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. మరి అల్లు అర్జున్ ఎవరిని ముందుగా ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇటు సౌత్ లోనే కాదు అటు నార్త్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు