2024 Filmfare : సందీప్ రెడ్డితో పెట్టుకుంటే ఇట్లుంటది మరి… “యానిమల్”తో “జవాన్” పోటీనా?

2024 Filmfare : తాజాగా జరిగిన 2024 ఫిలింఫేర్ అవార్డుల విషయంలో సత్తా చాటిన “యానిమల్” షారుక్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం రాత్రి గుజరాత్ లో గ్రాండ్ గా జరిగింది 69వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక. ఈ వేడుకలో ఏకంగా 5 అవార్డులను అందుకుని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కు “యానిమల్” షాక్ ఇవ్వడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తమ నటుడిగా నామినేట్ అయినప్పటికీ అవార్డును మాత్రం అందుకోలేకపోయాడు షారుక్.

ఉత్తమ నటుడి కోసం నామినేట్ అయిన వారిలో రణబీర్ కపూర్ (యానిమల్), షారుక్ ఖాన్ (డంకీ, జవాన్), రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని), బాబి డియోల్ (గదర్ 2), విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ “యానిమల్” సినిమాలో రణబీర్ కపూర్ కనబరిచిన నటనకు ఫిలింఫేర్ అవార్డు ఫిదా అయింది. ఫలితంగా ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ ఈసారి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది షారుఖ్ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫిలింఫేర్ అవార్డులను విమర్శించడం మొదలుపెట్టారు. వరస ఫెయిల్యూర్స్ తో నిర్జీవంగా పడి ఉన్న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడని, రెండుసార్లు 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి నార్త్ థియేటర్లకు కు ఒంటి చేత్తో ప్రాణం పోశాడనీ అంటున్నారు. అలాంటిది షారుక్ ఖాన్ కు అవార్డు రాకపోవడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే షారుక్ బెస్ట్ యాక్టర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ “యానిమల్”లో రణబీర్ పోషించిన పాత్ర ప్రభావం “జవాన్”, “డంకీ” సినిమాలో షారుక్ చేసిన పాత్రల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి రణబీర్ కు అవార్డు రావడం సమంజసమే అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి “యానిమల్” మూవీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సింగర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో విజేతగా నిలిచి ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇక షారుక్ విషయానికి వస్తే… ఆయన నటించిన పఠాన్, డంకీ సినిమాలకు పలు విభాగాల్లో ఫిలిం ఫెయిర్ అవార్డు లభించింది కానీ, ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా రాకపోవడం అవమానంగా భావిస్తున్నారు షారుక్ అభిమానులు. ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయిన జవాన్, పఠాన్ సినిమాలకు కూడా అవార్డు దక్కలేదు. “12th ఫెయిల్” చిత్రానికి బెస్ట్ మూవీగా ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఏదేమైనా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న “యానిమల్” మూవీ బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డులను ఐదు విభాగాల్లో అందుకోవడం విశేషమే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు