Tamannah : దేవాలయాల్లో మిల్కీ బ్యూటీ ప్రత్యేక పూజలు… ఎవరి కోసమంటే?

Tamannah :  మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేకంగా పలు దేవాలయాలను సందర్శిస్తూ వరుసగా పూజలు చేస్తోంది. ఈ విషయం గురించి కనీసం సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ తన అభిమానులతో పంచుకోకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ దేవాలయాల్లో తమన్నా చేస్తున్న ప్రత్యేక పూజలు ఎవరి కోసం?

తమన్నా గత కొంతకాలంగా సినిమాలను తగ్గించేసిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ పలు వెబ్ సిరీస్ లలో, లేదంటే స్పెషల్ సాంగ్స్ తో దుమ్ము దులిపేయడం వంటివి మాత్రమే చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వంటి వెబ్ సిరీస్ లు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో తమన్నా ఒలకబోసిన గ్లామర్ డోస్ కు కుర్రాళ్లకు కునుకు కూడా కరువైంది. మరోవైపు “జైలర్” సినిమాలో “నువ్వు కావాలయ్యా” అంటూ సోషల్ మీడియాను షేక్ చేసి పారేసింది. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా ప్రాజెక్ట్ ఏమీ లేవు.

ముఖ్యంగా సౌత్ నుంచి తమన్నా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ చేతిలో రెండు ఓటీటీ ప్రాజెక్టులు మాత్రం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతోందని, అందుకే కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేయట్లేదని ప్రచారం జోరందుకుంది. గత కొంతకాలంగా తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా వరుసగా దేవాలయాలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

తమన్నా ప్రస్తుతం వరుసగా దేశవ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలను సందర్శిస్తోంది. తాజాగా ఆమె అస్సాంలోని కామాఖ్య దేవి దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయడం పలు రూమర్లకు దారి తీసింది. సాధారణంగా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే తమన్నా, ఈ దేవాలయాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ను అభిమానులతో పంచుకోకపోవడం పలు ఊహాగానాలకు దారి తీసింది. గత రెండేళ్ల నుంచి తన ప్రియుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న తమన్నా త్వరలో అతన్ని వివాహం చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి కోసమే ఇలా వరుసగా దేవాలయాలను సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయడం వంటివి చేస్తోందని అంటున్నారు. మొత్తానికి కాబోయే భర్తతో పెళ్లి కోసం తమన్న ఇలా ప్రత్యేక నోములు నోస్తోంది అన్నమాట.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు