Poonam Kaur: సోనూసూద్ కి పద్మ విభూషణ్ ఎందుకు ఇవ్వలేదు.. మండిపడుతున్న పూనమ్..!

Poonam Kaur:  భారతదేశంలో అత్యంత రెండవ గౌరవ పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. దీనిపై మెగాస్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం కొన్ని సందేహాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఈ వార్తలు కాస్త తెరపైకి వచ్చాయి.. చిరంజీవి కంటే.. ప్రజలకు సహాయం చేసి వారి ఆదరాభిమానాలు పొందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు కదా.. వాళ్లకి ఇవ్వని ఈ సత్కారం చిరంజీవికి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా సమయంలో సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎవరు ఎలాంటి సహాయం కావాలన్నా తెలుసుకొని మరీ వెళ్లి వారికి సహాయం చేశారు.. మరి అలాంటి వ్యక్తికి ఇవ్వని ఈ పద్మభూషణ్ చిరంజీవికి ఎందుకు ఇచ్చినట్లు అనేది చాలామంది ప్రశ్న..

అయితే ఇదే ప్రశ్నను యంగ్ బ్యూటీ పూనమ్ కూడా అడిగింది.. సోనూసూద్ లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇచ్చి కేంద్రం గౌరవించాల్సింది అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.. ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడారు . ఇప్పుడు పూనమ్ కౌర్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకుంది..

- Advertisement -

“సోనూ సూద్ కూడా ఆ ప్రెస్టేజియస్ అవార్డుకి అర్హులు.. కరోనా సమయంలో ఆయన చేసిన సేవ చాలా గొప్పది.. ఆయనకి ఏ రాజకీయ నాయకుడిని కాక పట్టడం తెలియదు కదా అందుకే”.. అంటూ పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి రాజకీయ నాయకులను కాకాపట్టి ఈ అవార్డు తెచ్చుకున్నారు అనే అర్థం వచ్చేటట్లు పోస్ట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. చాలామంది ఈ పోస్ట్ షేర్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నారు.

దీంతో మెగా అభిమానులు మాత్రం చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ అంటూ చిరంజీవిని వెనకేసుకొస్తున్నారు.. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం చిరంజీవికి అవార్డు రావడాన్ని తప్పు పట్టలేదు కానీ సోనూసూద్ కి ఎందుకు ఇవ్వలేదు అని మాత్రమే అడుగుతున్నాము అంటూ పూనం చేసిన మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు