Sonu Sood: సేవా దృక్పథం

సోనుసూద్ అంటే దేశ‌వ్యాప్తంగా తెలియ‌ని వారుండ‌రు. ఎందుకంటే ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందిని విదేశాల నుంచి సొంత ఊర్ల‌కి రావ‌డానికి సాయం చేశారు. క‌రోనా స‌మ‌యంలో వైద్యం కోసం మ‌హిళ‌ల‌కు, చిన్నారుల‌కు, వృద్ధుల‌కు వారు వీరు అని తేడా లేకుండా దాదాపు చాలా వ‌ర‌కు హెల్పింగ్ చేశారు సోనుసూద్‌. సేవా గుణం క‌లిగిన సోనుసూద్ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.

డివైన్ ఇండియా యూత్ అసోసియేష‌న్ (DIYA) స‌హ‌కారంతో ఉచిత ఐఏఎస్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాడు హెల్పింగ్ స్టార్ సోనుసూద్‌. సంభ‌వం పేరుతో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో మంది ఐఏఎస్ ప‌రీక్ష‌లకు స‌న్న‌ద్ధం అయ్యే వారికి ఉచితంగా శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. 2022-23 ఏడాదికి ఎంపికైన పేద విద్యార్థుల‌కు ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పించ‌నున్న‌ట్టు సోనుసూద్ ప్ర‌క‌టించారు.

అన్ని వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు స‌మాన అవ‌కాశాలు వ‌స్తాయి అని సోనుసూద్ అభిప్రాయ‌ప‌డ్డాడు. మొట్ట‌మొద‌టిసారిగా ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన సోనుసూద్ ఈ సంవ‌త్స‌రానికి ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్న‌ట్టు తెలిపారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు