Govind Padmasoorya: ఓ ఇంటి వాడైన బన్నీ విలన్.. వధువు ఎవరంటే..?

Govind Padmasoorya:  ఇటీవల కాలంలో చాలామంది బ్యాచిలర్ లైఫ్ ను వీడి ఒక ఇంటి వారవుతున్నారు. వెండితెర సెలబ్రిటీలే కాదు బుల్లితెర సెలబ్రిటీలు కూడా వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బన్నీ సినిమాలో విలన్ గా నటించి.. అందరిని అలరించిన గోవింద్ పద్మ సూర్య కూడా ఒక ఇంటి వారు కాబోతున్నారు. అల్లు అర్జున్ నటించిన అలవైకుంటపురంలో సినిమాలో విలన్ గా చేసిన గోవింద్ పద్మ సూర్య అందరికీ గుర్తుండే ఉంటారు.. సముద్రఖని కొడుకు పైడితల్లిగా నటించిన ఈయన.. తొలి తెలుగు సినిమాతోనే ప్రేక్షకులకు చేరువయ్యాడు..

మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈయన అలవైకుంఠపురంలో సినిమా తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.ఇప్పుడు తాజాగా మలయాళీ సీరియల్ నటి గోపిక అనిల్ ను వివాహం చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. కేరళలోని ప్రముఖ వడక్కు నాథ్ ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తాజాగా గోవింద్ సోషల్ మీడియా ఖాతాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ఇవి చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పద్మ సూర్య కెరియర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో విలన్ గా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన మలయాళం లో టీవీ షోలకు హోస్టుగా చేస్తూ అంతకుమించి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక గోపిక విషయానికి వస్తే.. మలయాళంలో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే గత ఏడాది అక్టోబర్ లో గోవింద్ – గోపికల నిశ్చితార్థం జరగగా.. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే గోవింద్ మాత్రం తమది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన వివాహం అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే ఈ జంట చూడ చక్కగా ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ నూతన జంటకి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు