Allu Arjun: ఆమె విషయంలో బన్నీకి వార్నింగ్ ఇచ్చిన స్నేహారెడ్డి.. కట్ చేస్తే..!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించిన అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా భారీ క్రేజ్ ను అందుకున్నారు.. బాలీవుడ్ లో కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాతో గ్లోబల్ హీరోగా మారాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని మరింత పగడ్బందీగా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

పుష్ప-2 సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు అల్లు అర్జున్.. ఇందులో హీరోయిన్గా యానిమల్ సినిమాలో నటించిన తృప్తి డిమ్రిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి దీంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ భార్య ఆమెతో నటించవద్దంటూ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి..తృప్తి డిమ్రి యానిమల్ సినిమాలో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.. ఈ సినిమా చూసిన తర్వాత స్నేహ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అందుకు సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. మైత్రి మూవీ మేకప్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పుడు మరొక అప్డేట్ వైరల్ గా మారుతోంది . ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

ఏది ఏమైనా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి మాత్రం తృప్తి డిమ్రి అంటే కాస్త మండిపోతున్నట్లు పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవలే త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాని తెరకెక్కించి మంచి కలెక్షన్స్ వసూలు చేశారు.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో మొదట సినిమా చేస్తారా? లేక బన్నీతో సినిమా చేస్తారా? అన్నది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు