Ram Charan : ఒకేసారి రెండు అప్డేట్స్… మెగా ఫ్యాన్స్ కి గేమ్ చేంజింగ్ టైం షురూ

Ram Charan : “ఆర్ఆర్ఆర్” సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాల అప్డేట్ విషయంలో చాలా గ్యాప్ వచ్చింది. చెర్రీ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న “గేమ్ ఛేంజర్‌” సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని చాలా కాలం నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేకపోవడంతో అసహనంగా రాంచరణ్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. అయితే త్వరలోనే వీళ్ళ ఎదురుచూపులకు తెరపడబోతోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా డబుల్ బొనాంజా ఉండబోతుందని సమాచారం. ఒకేసారి రెండు సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.

ట్రిపుల్ ఆర్ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తానంటూ రామ్ చరణ్ తన అభిమానులకు ప్రామిస్ చేశాడు. అన్నట్టుగానే రిలీజ్ అయిన వెంటనే ఆచార్యలో కనిపించాడు. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో చెర్రీ ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో “గేమ్ ఛేంజర్‌” అనే సినిమాను చేస్తున్నట్టుగా చెర్రీ ప్రకటించడంతో మెగా అభిమానులు తెగ సంతోష పడిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. “గేమ్ ఛేంజర్‌” మూవీ షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి కాలేదు సరి కదా కనీసం టీజర్ కూడా విడుదల చేయలేదు.

శంకర్ “గేమ్ ఛేంజర్‌”తో పాటు “ఇండియన్ 2” మూవీ షూటింగ్ బాధ్యతలు ఏకకాలంలో నెత్తి మీద వేసుకోవడంతో ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ పై పడింది. “గేమ్ ఛేంజర్‌” సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతుండడంతో చాలాకాలంగా ఇదే మూవీలో చిక్కుకుపోయాడు చెర్రీ. ఈ సినిమా తర్వాతే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాను కమిట్ అయ్యాడు. ఆ మూవీ స్టార్ట్ చేయాలి అంటే ఈ మూవీ కంప్లీట్ అవ్వాలి. ఈ నేపథ్యంలో మెగా ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.

- Advertisement -

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్డేట్లు రాబోతున్నాయి. మెగా అభిమానులకు డబుల్ బొనాంజా ఉంటుందని, అందులో ఒకటి “గేమ్ ఛేంజర్‌” టీం నుంచి, మరొకటి బుచ్చిబాబు మూవీ నుంచి అని తెలుస్తోంది. “గేమ్ ఛేంజర్‌” గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బుచ్చిబాబు సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. కాగా ప్రస్తుతం “గేమ్ ఛేంజర్‌” షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చ్ నెలలోపు ఈ మూవీ షూటింగ్ పూర్తయితే, ఈ ఏడాది సెప్టెంబర్ లో “గేమ్ ఛేంజర్‌” మూవీని రిలీజ్ చేస్తారు. అనంతరం ఈ వేసవిలో బుచ్చిబాబుతో రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. చెర్రీకి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఈ ప్రాజెక్టుపైన బుచ్చిబాబు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు