Sandalwood: స్టార్ హీరో ఫ్యామిలీలో చిచ్చు..ఆమె వల్లేనా..?

Sandalwood: శాండిల్ వుడ్ లో ఇటీవలే కాటేరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు నటుడు డి బాస్ దర్శన్.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో అటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లు మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో హీరో దర్శన్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి మరొక నటి అయిన పవిత్ర గౌడతో గొడవ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ దెబ్బతో ఛాలెంజింగ్ స్టార్ అయిన దర్శన్ కుటుంబ సమస్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. దర్శన్ భార్య విజయలక్ష్మి అటు కన్నడ నటి పవిత్ర గౌడ ఇద్దరూ కూడా దర్శన్ విషయంలో ఒకరి మీద ఒకరు చాలెంజ్ చేసుకుంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి దర్శన్ కి నటి పవిత్ర గౌడ్ తో ఎఫైర్ ఉందన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు శాండిల్ వుడ్ లో మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అందుకు కారణం పవిత్ర గౌడ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఫోటోలే కారణమన్నట్టుగా తెలుస్తోంది. పవిత్ర గౌడ కొన్ని కన్నడ సినిమాలలో నటించింది. దీంతో దర్శన్ – పవిత్ర గౌడ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి..అంతేకాకుండా తరచూ దర్శన్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు అందుకు ఒక క్యాప్షన్ కూడా పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది..క్యాప్షన్ ఏమంటే “మా సంబంధం పూర్తి అయ్యి 10 సంవత్సరాలు అయ్యిందంటూ” పవిత్ర గౌడ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

- Advertisement -

గత ఏడాది కూడా పవిత్ర గౌడ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియలలో పవిత్ర గౌడ, ఆమె కూతురుతో పాటూ హీరో దర్శన్ కూడా ఉన్నారు. అంతేకాకుండా దర్శన్ డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నట్లుగా ఆ వీడియోలు కనిపించారు.. గతంలో పవిత్ర గౌడ, దర్శన్ ఇద్దరు కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఇటీవలే దర్శన్ 46వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఒక వీడియోను పవిత్ర గౌడ ఫ్రెండ్ మేఘశక్తి సోషల్ మీడియాలో విడుదల చేయగా దర్శన్ భార్య విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చిందట. అయినప్పటికీ కూడా పవిత్ర గౌడ నేరుగా దర్శన్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో ఇటు దర్శన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్టుగా అయింది. మరి ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు