Eagle : ఇంత జరిగాక కూడా “ఈగల్”కు ఈగో అవసరమా? కంటెంట్ పై నమ్మకం లేదా ఏంటి?

Eagle : సంక్రాంతి సినిమాల గొడవ అయిపోయింది. ఒకేసారి నాలుగు సినిమాలు రావడం, అందులో పెద్ద సినిమా, చిన్న సినిమా అంటూ థియేటర్ల సమస్య ఎదురవ్వడం, అన్నీ దాటుకుని ముందుకెళ్తే ఫేక్ రేటింగ్స్ అంటూ కేసులు పెట్టడం చూసేసాము. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడడం, థియేటర్లు కూడా దొరకవు అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఫిబ్రవరి సినిమాల కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. “ఈగల్” సోలో రిలీజ్ విషయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? “గుంటూరు కారం” టీం చేసిన సేమ్ మిస్టేక్ నే “ఈగల్” టీం రిపీట్ చేస్తోందా?

మాస్ మహారాజా రవితేజ వరుస డిజాస్టర్లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పై గట్టి ఎఫెక్ట్ పడింది. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన “ఈగల్” మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. నిజానికి ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికే నలుగురు స్టార్ హీరోలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూ ఉండడంతో, సోలో రిలీజ్ పై కన్నేసింది “ఈగల్” టీం.

నిజానికి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న సినిమాలకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రామిస్ చేయడం వల్లే “ఈగల్” నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంక్రాంతి వివాదం అయితే సద్దుమణిగింది గాని తాజాగా మరో వివాదం మొదలైంది. ఎందుకంటే “ఈగల్” టీం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రావడానికి ఫిక్స్ అవడంతో, అప్పటికే అదే తేదీపై కర్చీఫ్ వేసి కూర్చున్న “ఊరు పేరు భైరవకోన”, “టిల్లు స్క్వేర్” వంటి సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

ఇందులో “టిల్లు స్క్వేర్” ఇప్పటికే పోస్ట్ పోన్ కాగా, “ఊరు పేరు భైరవకోన” నిర్మాతలు మాత్రం తమను వాయిదా గురించి ఎవరూ సంప్రదించలేదని, తాము పడిన రెండేళ్ల కష్టాన్ని అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకొస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మళ్లీ సంక్రాంతి సీన్ రిపీట్ అవుతోంది. గుంటూరు కారం, హనుమాన్ మధ్య జరిగిన వార్ గుర్తుకు తెస్తుంది. అయితే “ఈగల్” సినిమాకు నిజంగానే అన్ని థియేటర్లు అవసరమా? ఊరు పేరు భైరవకోన అనేది చిన్న సినిమానే కాబట్టి, ఈగల్ కు పోటీగా వచ్చినా పెద్దగా ఇబ్బందేం ఉండదు.

కానీ రవితేజ టీం సోలో రిలీజ్ డేట్ గురించి పట్టుబడితే “గుంటూరు కారం” టీం తప్పునే రిపీట్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఈ మూవీ పొరపాటున డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా విమర్శలు దారుణంగా ఉంటాయి. ఇప్పటికే గుంటూరు కారం సినిమా విషయంలో మేకర్స్ పెద్ద స్టార్ అంటూ సినిమాను హైప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి కంటెంట్ బాగుంటే కటౌట్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి “ఈగల్” టీంకు తమ కంటెంట్ పై నమ్మకం లేదా? ఇంత జరిగినా కూడా “ఈగల్” టీంకు ఈగో అవసరమా? అంటున్నారు నెటిజన్లు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు