Dil Raju :”అయాలాన్” కోసమే “ఈగల్”ను సైడ్ చేశాడా? ఈ ప్రొడ్యూసర్ కు మాట మీద నిలబడడం చేతకాదా?

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుపై టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా గుర్రుగా ఉన్నారు. “అయాలాన్” అనే కోలీవుడ్ మూవీకి అండగా దిల్ రాజు నిలవడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే ఈ నిర్మాతకు అసలు మాటమీద నిలబడడం చేతకాదా? అంటూ మండిపడుతున్నారు. పైగా ఇటీవల సంక్రాంతి రేస్ నుంచి ఇటీవలే తప్పకున్న “ఈగల్” మూవీ మేకర్స్ పై సానుభూతిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందుగా ఈ సంక్రాంతికి ఐదుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు పోటీలోకి దిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబు “గుంటూరు కారం”, రవితేజ “ఈగల్”, వెంకటేష్ “సైంధవ్”, నాగార్జున “నా సామి రంగ” సినిమాలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “హనుమాన్” కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే ఈ బిగ్ క్లాష్ వల్ల థియేటర్ల సమస్యతో పాటు, నిర్మాతలకు నష్టాలు తప్పవనే ఉద్దేశంతో ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు ఒక్క మూవీనైనా వాయిదా వేసుకోవాలంటూ ఆయా మూవీ మేకర్స్ ను రిక్వెస్ట్ చేశాడు.

కానీ ఎవ్వరూ తమ సినిమాలను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత అనూహ్యంగా “ఈగల్” టీం సంక్రాంతి రేసు నుంచి సైలెంట్ గా సైడ్ అయిపోయింది. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు గానీ దిల్ రాజు ముందుగా చెప్పినట్టే ఈ మూవీకి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఇచ్చేసాడు. అప్పటికే ఫిబ్రవరి 9ని బ్లాక్ చేసుకున్న రెండు చిన్న సినిమాలు దిల్ రాజు నిర్ణయం వల్ల ఇబ్బంది పడ్డాయి. దీంతో సమస్య తీరలేదు. సంక్రాంతికి రిలీజ్ కానున్న నాలుగు సినిమాలకు థియేటర్ల సమస్య మొదలైంది.

- Advertisement -

దిల్ రాజు తాను రిలీజ్ చేయబోతున్న “గుంటూరు కారం” మూవీకే అన్ని థియేటర్లను కేటాయించడం, “హనుమాన్” మూవీకి కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లను మాత్రమే కేటాయించడంపై వివాదం తలెత్తింది. పలువురు ప్రముఖులు దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు “అయాలాన్” అనే తమిళ సినిమాను ఇప్పటికే భారీ క్లాష్ నెలకొన్న జనవరి 12న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాడు. నైజాంలో, వైజాగ్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడు.

అది కూడా థియేటర్ల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాలకు పోటీగా. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ ప్రియులంతా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గతంలో దిల్ రాజు సంక్రాంతి సీజన్ లో “వాల్తేరు వీరయ్య”, “వీర సింహా రెడ్డి” వంటి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, “వారసుడు” అనే తమిళ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యి వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ వివాదం కారణంగా అప్పట్లోనే తాను ఇకపై తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తానని, తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఇతర డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయనని స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

కానీ ఇప్పుడేమో ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను అన్నట్టుగా సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉండగా, మరో తమిళ సినిమాను తీసుకొచ్చి మాట తప్పాడు దిల్ రాజు. దీంతో “అయాలాన్” కోసమే “ఈగల్”ను సైడ్ చేశాడా? ఈ ప్రొడ్యూసర్ కు అసలు మాట మీద నిలబడడం చేతకాదా అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు