Saindhav: ప్రపోజ్ చేసిన నవాజుద్దీన్.. బయట పెట్టిన శ్రద్ధా..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సైంధవ్ కూడా ఒకటి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా, శైలేష్ కొలను డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ బీచ్ వేదికగా జనవరి 7న గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ సహా మూవీ లోని నటీనటులు అందరితో పాటు మేకర్స్ కూడా రావడం జరిగింది. ఇక సాధారణంగా వెంకటేష్ సినిమా అయినా, ఆయన ఉన్న ఈవెంట్ అయినా కూడా జాలిగా సరదాగా ఉంటుంది.

అలాగే సైంధవ్ ఈవెంట్ లో కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. ఇక వెంకటేష్ వచ్చాక ఓ సందర్భంలో యాంకర్ శ్యామల చిత్ర నటీనటుల్ని స్క్రీన్ పై కొన్ని ఫోటోలని చూపిస్తూ, అందులో ఎవరు ఏం మాట్లాడుతున్నారో చెప్పామన్నారు. ఆ సందర్భంలో ‘నవాజుద్దీన్ సిద్ధికి’ ఆండ్రియా ఉన్న ఫోటో ప్లే చేయగా, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా అని శ్రద్ధా శ్రీనాథ్ ని అడగగా, నవ్వుతూ సమాధానం ఇచ్చిన శ్రద్ధా ప్రపోజ్ చేస్తున్నాడేమో, దానికి ఆండ్రియా చిన్న స్మైల్ ఇచ్చిందని అంది. అంటే ప్రపోజల్ ఆక్సెప్టెడా అనే, లేదు రిజెక్ట్ చేసి నవ్విందేమో అంది.

ఇక మధ్యలో శైలేష్ కొలను కలగచేసుకుని ఆ ఫోటోని చూసారు కదా, వీళ్ళ లవ్ స్టోరీ వన్ అఫ్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిపోతుంది, అది ఎందుకంటే సినిమా చూసాక ప్రేక్షకులకి అర్ధమవుద్ది అన్నాడు. దీన్ని బట్టి సైంధవ్ లో నవాజుద్దీన్ లవర్ గా ఆండ్రియా కనిపించొచ్చు అని భావించొచ్చు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు