Brahmanandam: తిండి కోసం తిప్పలు.. ఆమె వల్లే ఈ జీవితం – బ్రహ్మానందం..!

Brahmanandam: నవ్వుల రారాజు బ్రహ్మానందం తాజాగా నేను – మీ బ్రహ్మానందం అనే ఒక పుస్తకాన్ని రచించారు. అందులో తన ఆత్మ కథను తానే రాసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగగా అందులో ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి రాకముందు చదువు కోసం ఎన్ని తిప్పలు పడ్డారు.. ?తినడానికి తిండి లేక ఆయన పడిన అవస్థలు ఏంటి? ఇప్పుడు తిరిగి ఆయన ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? ఇలా అనేక విషయాలు ఆ పుస్తకంలో పొందుపరిచారు.. మరి ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం..

అనసూయమ్మ అనే ఒక టీచర్ వల్లే తన జీవితం ఇంత బాగుంది అని వెల్లడించారు. తన టాలెంట్ ని చూసి దయ తలచి అనసూయమ్మ లాంటి టీచర్లు, అలాగే కొంతమంది చేసిన సహాయం వల్లే తన చదువు మొత్తం సాగింది అని.. తన పుస్తకంలో రాసుకొచ్చారు. స్కూల్ తర్వాత.. ఇంటర్ , డిగ్రీ పూర్తి చేయడానికి తనకు సహాయం చేసిన వాళ్ల ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసి పెడుతూ చదువుకున్నట్లు.. డిగ్రీలోనే నాటకాలు, మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తూ చదువుకున్నట్లు తెలిపారు.

డిగ్రీ బి.ఎ తెలుగు పూర్తి అయిన తర్వాత ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి బ్రహ్మానందం దగ్గర డబ్బులు లేవట. అంతలోనే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేయడంతో అక్కడి సీటు కోసం ప్రయత్నించగా.. తన కళ ను, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఉచితంగా సీటు ఇచ్చారని.. చదువుకోడానికి సీటు వచ్చింది కానీ అక్కడ హాస్టల్ లో ఉండి చదువుకోవాలంటే డబ్బులు లేవు.. అందుకే గుంటూరు వద్ద నల్లపాడు లో చిన్న చిన్న గదులు కట్టి విద్యార్థుల కోసం అద్దెకిచ్చే చోట ఉంటూ.. అనసూయమ్మ టీచర్ ఇచ్చే సహాయంతో చదువుకునే వారట. అయితే తిండికి కూడా ఆమెను అడగడం ఇష్టం లేక భోజనానికైనా సంపాదించుకోవాలని ఏదో ఒక పని చేద్దాం అనుకున్నారట.

- Advertisement -

అదే సమయంలో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లేదారిలో ఒకచోట లారీలను రిపేర్లు చేస్తూ.. పెయింట్స్ వేసే వాళ్ళట. అప్పటికే బ్రహ్మానందం బొమ్మలు బాగా గీసేవారు. ఆ పెయింట్ పనేదో బాగుంది అనిపించి అక్కడికి వెళ్లి సహాయకుడిగా చేరారట. కొన్ని రోజుల్లోనే తాను కూడా లారీలకు పెయింట్స్ వేస్తూ.. ఉదయం కాలేజీకి వెళ్లడం సాయంత్రం నుంచి లారీలకు పెయింట్ వేసి తినడానికి డబ్బు సంపాదించుకునే వారట. ఇప్పట్లో లాగా నెలజీతం కాకుండా కేవలం పనిని బట్టి నాలుగు లేదా ఐదు రూపాయలు ఇచ్చేవారట.. ఇక అలా లారీలకు పెయింట్ చేస్తూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొని.. ఇతరులు చేసిన సహాయంతో ఎంఏ పూర్తి చేసినట్లు బ్రహ్మానందం తెలిపారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు