Saindhav pre release event: స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన వెంకీ… అసలేమైంది అంటే?

Saindhav pre release event: విక్టరీ వెంకటేష్‌ను ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ గానే చూశారు. ఇటీవల రానా నాయుడు లాంటి ఓ బోల్డ్ వెబ్ సిరీస్ వస్తే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రానా నాయుడు చాలా రికార్డులు క్రియేట్ చేసినా అలాంటి కంటెంట్ ను వెంకీ ఎంచుకోవడంపై ఈ విమర్శలు వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వెంకీ మరోసారి తనకు కలిసొచ్చిన జానర్ కాకుండా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. అదే సైంధవ్.

హిట్, హిట్ 2 లాంటి సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సైలేష్ కొలను దీనికి దర్శకుడు. ఇటీవల మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ట్రైలర్ లో స్టోరీ మొత్తం చెప్పేసినా, సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ మాత్రం పెరిగింది ఆడియన్స్ లో.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది మూవీ యూనిట్. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని సినిమాలకు ఆడియన్స్ సపొర్ట్ వచ్చిందని, ఇప్పుడు 75వ మూవీకి కూడా సపొర్ట్ వస్తుందని అన్నారు. అలాగే ఈ సినిమా ఆడవాళ్లుకు బాగా నచ్చుతుందని అన్నారు. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు అక్కా, చెల్లి, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నా ఇలా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని, అందరికీ నచ్చే మూవీ అని అన్నారు.

- Advertisement -

అంతే కాదు, ఈ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్లు తప్పకుండా ఏడుస్తారని అన్నారు. అలాంటి ఎలిమెంట్స్ తో సినిమా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే సినిమాలో హీరో తాను కాదని, సారా పాపనే హీరో అని తెలిపాడు. చిన్న వయసులో కూడా సారా చాలా అద్భతంగా నటించింది అంటూ వివరించాడు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్ లో చూడాలని అన్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు