Filmfare Awards List 2024 : బెస్ట్ యాక్టర్స్ రణబీర్, అలియా… ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లిస్ట్

2024 Filmfare :  బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 69వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాత్ లోని గాంధీ నగర్ లో నిర్వహించిన ఈ ఫిలింఫేర్ అవార్డుల వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ హోస్ట్ లుగా వ్యవహరించారు. 2024 ఫిలిం ఫేర్ అవార్డుల వేదికపై కార్తీక్ ఆర్యన్, కరీనా కపూర్, వరుణ్ ధావన్, కరిష్మా కపూర్ వంటి స్టార్స్ తమ పర్ఫామెన్స్ తో దుమ్మురేపారు. ఇక ఈ అవార్డుల్లో “12th ఫెయిల్” మూవీ తో పాటు “యానిమల్” మూవీ సత్తా చాటింది. “12th ఫెయిల్” మూవీ బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే లాంటి అవార్డులను సొంతం చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

“యానిమల్” మూవీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్లు కొల్లగొట్టిన “యానిమల్” మూవీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ ఏకంగా ఐదు అవార్డులను దక్కించుకొని మరోసారి సత్తా చాటింది. ఈ అవార్డుల్లో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే… ఈసారి ఫిలింఫేర్ అవార్డుల్లో సెలబ్రిటీ కపుల్ రణబీర్ కపూర్ “యానిమల్” సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా, ఆయన భార్య అలియా భట్ “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని” సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు. మరి 2024లో ఫిలింఫేర్ అవార్డులు ఇంకా ఎవరెవరిని వరించాయి అంటే…

69వ ఫిలింఫేర్ అవార్డుల విన్నర్స్ లిస్ట్ :
పాపులర్ బెస్ట్ ఫిలిం – 12th ఫెయిల్
క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం – జోరం
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ – రణబీర్ కపూర్ (యానిమల్)
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫిమేల్) – అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ మేల్ – విక్కీ కౌశల్ (డంకి)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ – షబానా అజ్మీ (రాకి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని)
బెస్ట్ డైరెక్టర్ – విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ లిరిక్స్ – అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే – జర హట్కే జర బచ్కే)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – యానిమల్ (ప్రీతం, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ – భూపిందర్ బబ్బల్ (అర్జున్ వైలీ – యానిమల్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ – శిల్పారావ్ (బేషరం రంగ్ – పఠాన్)
బెస్ట్ స్టోరీ – అమిత్ రాయ్ (ఓఎంజి 2)
బెస్ట్ స్క్రీన్ ప్లే – విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ – ఇషిత మోయిత్రా (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని)

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు