HanuMan: కోటి టికెట్లు… కొనసాగుతున్న హనుమాన్ విధ్వంసం

HanuMan:  చిన్న సినిమా… చిన్న సినిమా… అంటూ ఇండస్ట్రీ పెద్దలు చిన్న చూపు చూసిన హనుమాన్ ఇప్పుడు విధ్వంసం చేస్తుంది. ఒక తెలుగు భాషలోనే కాదు, నార్త్‌లో కూడా ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే 250 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిన్న సినిమా, ఇప్పుడు 300 కోట్ల మార్క్ దగ్గర వరకు వస్తుంది. అయితే ఈ సమయంలో ఈ మూవీ మరో మైలు రాయి అందుకుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. అంటే హనుమాన్ సినిమాకు సంబంధించి కోటి టికెట్లు అమ్ముడుపోయాయి. ఒక సినిమాను కోటి మంది చూడటం పెద్ద విషయం కాదు. కానీ, హనుమాన్ సినిమా అనేది ఓ స్టార్ డైరెక్టర్ నుంచి రాలేదు. చెప్పుకోదగ్గ నటీనటులు కూడా అందులో లేరు. పైగా ఇప్పటి వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, అగ్ర హీరోలు అని చెప్పుకుంటున్న మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున నటించిన సినిమాలతో పోటీగా వచ్చింది ఈ హనుమాన్.

ఆ స్టార్ హీరోలు, అగ్ర హీరోల సినిమాలను పక్కన పెట్టి, ఈ చిన్న సినిమాను కోటి మంది చూడటం అనేది నిజంగానే చెప్పుకోదగ్గ విషయమే. అంతే కాకుండా, ఈ సినిమా రిలీజ్ టైంలో వచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. థియేటర్స్ ఇవ్వలేదు. ఇచ్చిన థియేటర్స్ హనుమాన్ మూవీని ప్రదర్శించలేదు. ఇలా ఎన్నో అడ్డంకుల మధ్య ఈ సినిమా ఆడింది. ఇలాంటి ప్రతీకూల పరిస్థితుల్లో కోటి మంది చూశారంటే కచ్చితంగా పెద్ద విషయమే.

- Advertisement -

రిలీజ్ అయి రెండు వారాలు దాటింది. మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా చోట్ల థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్ కనిపిస్తుంది. ఇది ఇప్పట్లో తగ్గేలా కూడా లేదు. అంటే… హనుమాన్ వీక్షకులు మరో 50 లక్షల వరకు అయిన పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే 300 కోట్లు కలెక్షన్లు అందుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టకపోవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు