Venu Thottempudu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. వేణు తొట్టెంపూడికి పితృవియోగం..!

Venu Thottempudu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు సెలబ్రిటీలనే కాదు వారి అభిమానులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినీ నటుడు, సీనియర్ హీరో తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వేణు తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. 92 సంవత్సరాల వయసులో ఆయన వయోభారం పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

తొట్టెంపూడి కుటుంబానికి అటు పొలిటికల్ గా.. ఇటు బిజినెస్ పరంగా మంచి పేరు ఉంది. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఇక వేణు కూడా సినీ ఇండస్ట్రీలో నటుడిగా, కామెడీ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. గతంలో స్టార్ హీరో హోదా పొందాల్సిన ఈయన కథల ఎంపిక విషయంలో తప్పటడుగు వేసి స్టార్ హీరో స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరం అయ్యి.. ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ ఉండిపోయారు. ఇక రీసెంట్గా రవితేజ సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు వేణు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన వేణు ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారని చెప్పాలి.

ఇక కెరియర్ ను మళ్ళీ రూపొందించుకోవాలనుకుంటున్న సమయంలో ఇలా పితృవియోగం పొందడం ఆయనను మరింత కలవరపరుస్తోంది. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఈరోజు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో వున్న స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ లో వున్న వారి స్వగృహం వద్ద ఉంచనున్నారు. ఇక సందర్శన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు వేణుకి పితృవియోగం అన్న వార్త తెలుసుకున్న ప్రముఖులు వేణుని పరామర్శిస్తున్నారు. అలాగే అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు