Venu thottempudi: ఆ హీరోయిన్ చేతిలో ఘోరంగా అవమానపడ్డ వేణు.. ఏమైందంటే..?

ఒకప్పుడు మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరించిన వేణు తొట్టెంపూడి ఎంతోమంది అభిమానులను తన సినిమాల ద్వారా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హీరోగా ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాదు యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందించాయి. అలా అప్పట్లో భారీ పాపులారిటీ దక్కించుకున్న వేణు తొట్టెంపూడి మొదటిసారి స్వయంవరం అనే సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక తర్వాత త్రివిక్రమ్ కథ,

మాటలు అందించిన చిరునవ్వుతో అనే సినిమా ద్వారా మరొకసారి మంచి విజయాన్ని సొంతం చేసుకొని హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇక తర్వాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ నటుడిగా మెప్పిస్తూ ప్రేక్షకులలో తనదైన మార్క్ వేసుకున్న వేణు.. చివరిగా దమ్ము సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు .

ఇప్పుడు మళ్లీ అతిధి అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్త నెట్ ఉంటే చాలా వైరల్ గా మారుతుంది. ఒక హీరోయిన్ చేతిలో ఘోరంగా అవమాన పడ్డారట వేణు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు? ఎటువంటి అవమానం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

వేణు కళ్యాణ రాముడు సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాలో హీరోయిన్ అయినా నిఖిత చేతిలో దెబ్బలు తిన్నట్లు అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇలా వార్తలు రావడానికి కారణం ఒక సీన్ చేస్తున్నప్పుడు నిఖిత వేణుని చెంప దెబ్బ కొట్టాల్సిన సీను ఉండడంతో అందులో ఆమె పొరపాటున వేణుని చెంప పైన గట్టిగా కొట్టిందట. దాంతో ఆయన చెంప మీద ఆమె 5 వేళ్ళు అచ్చు అలాగే పడిపోయింది.

అది చూసిన సినిమా యూనిట్ మొత్తం వేణుని నిఖిత కొట్టింది అంటూ ఒక పెద్ద న్యూస్ స్ప్రెడ్ చేశారు. అంతేకాదు నిఖిత చెంప దెబ్బ కొట్టి వేణుని ఘోరంగా అవమానించిందంటూ కామెంట్లు కూడా చేశారు. అయితే అది సినిమాలో ఒక భాగం అనే విషయం ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత నిఖిత.. వేణుకి సారీ చెప్పినట్టుగా కూడా సమాచారం. ఇకపోతే నిఖిత కూడా ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు కాబట్టి వేణు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు