Trisha: మన్సూర్ మరోసారి… త్రిషపై చేసిన కామెంట్స్ కాంప్లిమెంట్ గా తీసుకోవాలి

లియో సినిమాలో కీలక పాత్రలో చేసిన మన్సూర్ అలీ ఖాన్.. ఇటీవల త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే సోషల్ మీడియాలో మన్సూర్ అలీపై నెటిజన్లు దుమ్ముత్తిపోశారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తికి లియో సినిమాలో ఛాన్స్ ఇచ్చిన లోకేష్ కనగారాజ్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.

అయితే తాజాగా తన వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ వివరణ ఇచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక నోట్ రాసి రిలీజ్ చేశాడు. తన వ్యాఖ్యలను ఎవరో వక్రీకరించారని, ఎడిట్ చేసి తప్పు మీనింగ్ వచ్చేలా చేశారని చెప్పుకొచ్చాడు. లియో మూవీలో త్రిష పాత్ర చాలా కీలకం. పర్వతాన్ని ఎత్తిన హన్మంతుడితో త్రిషను పోల్చానని అంటూ వివరించాడు. కానీ, ఈ వ్యాఖ్యలను ఎక్కడా చూపించలేదని అన్నాడు. త్రిషకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన దాన్ని కాకుండా ఇతర వ్యాఖ్యలను చూపించారని చెప్పుకొచ్చాడు.

అలాగే ఎవరో తన కెరీర్ ను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారని అందుకే… నా మాటలను తప్పుగా చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటూ వివరించాడు. అలాగే ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో పని చేశానని, ఎవరితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదని ఆ నోట్ లో రాసుకొచ్చాడు.

- Advertisement -

అయితే ఇప్పటి వరకు జరిగిన వివాదనికి ఈ నోట్ ఓ సమాధనం అవుతుందని మన్సూర్ అనుకున్నాడు. కానీ, ఈ నోట్ తో మన్సూర్ మరోసారి ట్రోల్స్ కు గురి అవుతున్నాడు. కాంప్లిమెంట్స్ ఇచ్చినా, మన్సూర్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థించే విధంగా లేవని, అలాంటి వ్యాఖ్యలు చేసి కూడా తన తప్పును కవర్ చేసుకునేందకు.. కెరీర్ నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేయడం సరికాదు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు