Trisha: త్రిషను చూడగానే ఆగలేకపోయా- నటుడు కామెంట్స్ కి త్రిష కౌంటర్..!

టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇప్పటికీ కూడా బిజీ హీరోయిన్గా మారిపోయిన సీనియర్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా మన్సూర్ అలీ ఖాన్ మరొకసారి త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విలన్ రోల్స్ ఎక్కువగా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే ఈయన కొన్ని రోజుల క్రితమే రజనీకాంత్ జైలర్ సినిమాలో తమన్నా పాటపై వల్గర్ కామెంట్లు చేసి వివాదం సృష్టించారు.

అయితే ఇప్పుడు మరొకసారి త్రిషపై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను చాలా సినిమాలలో రేప్ సన్నివేశాలు చేశాను.. ముఖ్యంగా ఖుష్బూ, రోజా ఇలా ఎంతో మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తూ.. హ్యాపీగా ఫీల్ అయ్యాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిష తో కూడా రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ సినిమాలో అలాంటి సీన్ ఏమీ లేకపోవడం నన్ను బాధ పెట్టింది అని అన్నాడు. దీంతో మన్సూర్ చేసిన కామెంట్లు ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు త్రిష అభిమానులు, నెటిజన్ లు మన్సూర్ అలీఖాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా ద్వారా త్రిష వరకు వెళ్లడంతో త్రిష దీనిపై స్పందిస్తూ ఘాటుగా ట్వీట్ చేసింది. త్రిష స్పందిస్తూ.. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసభ్యకరంగా చేసిన కామెంట్ల వీడియో నా దృష్టికి వచ్చింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతడు చేసిన వ్యాఖ్యలు స్త్రీని ద్వేషిస్తూ.. చెడుగా చూపిస్తున్నట్టు అనిపిస్తోంది

- Advertisement -

ఇలాంటి వ్యక్తితో నేనెప్పుడూ కలిసి నటించనందుకు సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాలలో కూడా ఇతడితో కలిసి నటించడానికి నేను ఒప్పుకోను. ఇలాంటి వారి వల్ల మనుషులకి కూడా చెడ్డపేరు వస్తుంది అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం త్రిష చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు