Trisha: కెరియర్ అయిపోలేదు , కోట్లుకు పరుగులు పెడుతుంది.

త్రిష..  ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకి అభిమాన నటి అంటే త్రిష పేరు వినిపిస్తుంది.  అప్పటికి ఇప్పటికీ త్రిష అందం చెక్కుచెదరలేదు అని కూడా చెప్పొచ్చు.  అభినయం, అందం సమపాళ్లలో వేసి మిక్సీలో తిప్పగొడితే వచ్చే అవుట్ పుట్ త్రిష.
త్రిష చేసిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ ఫేవరెట్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు.అతడు, వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, స్టాలిన్ వంటి సినిమాలు త్రిషకి మంచి పేరుని తీసుకొచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలతో పాటు తెలుగులో ఉన్న చాలామంది స్టార్ హీరోస్ తో త్రిష నటించింది.  రీసెంట్ టైమ్స్ లో త్రిష నుంచి మంచి అవకాశాలు రావట్లేదు అనుకున్న తరుణంలో, పొన్నియన్ సెల్వన్  సినిమా త్రిష కెరియర్ ని, కెరియర్ గ్రాఫ్ ని మార్చేసింది.పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 తెలుగులో అంతగా హిట్ అవ్వకపోయినా కూడా తమిళ్ లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టి త్రిషను సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టింది.  అయితే ఈ సినిమాకి త్రిష తీసుకున్న రెమ్యునరేషన్ రెండు కోట్లు.  ఈ సినిమా తర్వాత త్రిష తన రెమ్యూనరేషన్ ని మూడు కోట్ల వరకు పెంచినట్లు సమాచారం.  ఇకపోతే రీసెంట్ గా  లియో సినిమాతో మంచి హిట్ అందుకుంది త్రిష. ఈ సినిమాకి త్రిష దాదాపుగా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది.ఏదేమైనా ఇప్పటికీ త్రిష చేతిలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  అందులో తలా అజిత్ తో ఒకటి కమలహాసన్ తో  మణిరత్నం చేయబోతున్న సినిమాలో కూడా త్రిష లీడ్ రోల్  కనిపించనుంది.  ఇప్పుడు త్రిష రెమ్యూనరేషన్ దాదాపు 12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  ఇకపోతే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా  నయనతార పేరు వినిపించేది.  ఇప్పుడు నయనతారను మించి త్రిష రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా ఈ విషయంపై త్రిష స్పదించినంతవరకు వరకు ఒక క్లారిటీ రాదు.Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు