Atlee: అట్లీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.?

రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు ఇళయ దళపతి విజయ్ తో చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు సాధించాడు. అట్లీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్లో అట్లీ చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలైంది. అందుకే అట్లీ అంటే తెలుగు వాళ్ళకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అట్లీ చేసిన మెర్షల్, తెరి, విజిల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఇళయ దళపతి విజయ్ తోనే చేశాడు. రీసెంట్ గా షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. జవాన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారుక్ ను అద్భుతంగా చూపించి 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు అట్లీ.

బేసిగ్గా అట్లీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయినా కూడా రొటీన్ కమర్షియల్ గా ఉంటాయనేది కొంతమంది అభిప్రాయం. కొన్ని సీన్స్ కూడా కొన్నిచోట్ల నుంచి కాపీ కొడతాడని వాదన కూడా ఉంది. ఇకపోతే అట్లీ తదుపరి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది. అట్లీ తర్వాత చేయబోయే సినిమా ఇండియన్ సినిమాలో గత 30 ఏళ్లలో రాని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అట్లీ ఒక హాలీవుడ్ రైటర్ తో కోలాబరేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అట్లీ తన తదుపరి సినిమా విజయ్, షారుక్ ఖాన్ కాంబినేషన్లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కి ఆల్రెడీ అద్భుతమైన హిట్స్ ఇచ్చాడు. అలానే షారుక్ కి కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరితో చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కౌట్ కాకపోయినా ఈ సినిమాను చేసే తీరుతాడు అంటున్నాడు అట్లీ. ఏదేమైనా ఫిలిం ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లో అట్లీ కూడా ఒకడు అని చెప్పొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు