Atlee: అట్లీ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూస్తే మతి పోతుంది

Atlee

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమా సక్సెస్ లో భాగంగా డైరెక్టర్ అట్లీ తన తరువాతి సినిమాల లైన్ అప్ ను రివీల్ చేసాడు. ప్రస్తుతం అట్లీ రివీల్ చేసిన ఆయన లైన్ అప్ సినిమాల బజ్ ఇప్పడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి.

జవాన్ సినిమా సక్సెస్ మీట్స్ లో భాగంగా డైరెక్టర్ అట్లీ ఆయన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయడానికి ప్లాన్ చేస్తునట్టు ఇది వరకే ప్రకటించాడు. అయితే అట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మరో రెండు సినిమాల కథల విషయంలోను ఆయన వర్క్ చేస్తునట్టు లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అట్లీని జవాన్ సినిమాలో ముందు నుంచి దళపతి విజయ్ క్యామియో చేస్తునట్టు వార్తలు వచ్చాయి. కానీ సినిమాలో దళపతి విజయ్ ను క్యామియో చేయించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించగా, షారుఖ్ ఖాన్, దళపతి విజయ్ లు కేవలం క్యామియో మాత్రమే చేస్తే సరిపోదని వారిద్దతో కలిసి ఒక ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్ సినిమా చేస్తేనే తనకు సంతృప్తిగా ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ఒక స్క్రిప్ట్ రెడీ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు కూడా చేస్తునట్టు తెలిపారు. అలాగే జవాన్ సినిమాకు సీక్వెల్ కూడా చేయాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

దీనిబట్టి చూస్తే అట్లీ ప్రస్తుతం మూడు సినిమాపై వర్క్ చేస్తునట్టు తెలుస్తోంది. అందులో మొదటిది అల్లు అర్జున్ తో ఐతే మరోకటి దళపతి విజయ్ , షారుఖ్ ఖాన్ లతో మల్టి స్టారర్ అలాగే ప్రస్తుతం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న జవాన్ సినిమాకు సీక్వెల్ అని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు