Game Changer: పాన్ ఇండియా సినిమాలకు లీకుల టెన్షన్..!

Game Changer

ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ కూడా మేకింగ్ లో కీలకంగా మారింది. సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి రిలీజ్ అయ్యే వరకు ఆడియెన్స్ లో ఇంట్రస్ట్ ఉండేలా చేయాలంటే ప్రమోషన్స్ ఎఫెక్టివ్ గా ప్లాన్ చేయాలి. ఇందుకోసమే సినిమా మేకింగ్ సమయంలో ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది సినిమా యూనిట్.

ఫిలిమ్ మేకర్స్ ఎంత జాగ్రత్త పడ్డా కానీ, అప్పుడప్పుడు ఫోటోలు వీడియోలు లీక్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లీక్స్ సినిమాకి ప్లస్ అయితే, ఇంకొన్ని సార్లు సినిమాకి మైనస్ అవుతూ ఉంటాయి. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా నుండి లీకైన సాంగ్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. పుష్ప2 షూటింగ్ స్పాట్ నుండి కూడా యాక్షన్ సీన్ కి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. వీటితో పాటు కల్కి సినిమా నుండి కూడా యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన పిక్ ఒకటి లీక్ అయ్యింది.

ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావటం, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి పెద్దగా అప్డేట్స్ లేకపోవటంతో ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీక్స్ అవ్వటం మేకర్స్ కి తలనొప్పిగా మారింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లకు కీలకంగా మారిన ఈ సినిమాల నుండి లీక్స్ రావటం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.

- Advertisement -

శంకర్ డైరెక్షన్లో రూపొందనుతున్న గేమ్ చేంజర్ 2024 సమ్మర్ కి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప2 కూడా 2024 సమ్మర్ బిగినింగ్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పాన్ వరల్డ్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కల్కి కూడా సమ్మర్లోనే రిలీజయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలు ఏ మేరకు అలరిస్తాయి వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు