Game Changer Song Leak: ఆ ట్యూన్ ఏంటి..? ఆ లిరిక్స్ ఏంటి..? – తమన్ పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్..!

Game Changer Song Leak

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందట స్టార్ట్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్2 సినిమా మీద కూడా కాన్సంట్రేట్ చేయటం వల్ల సినిమా డిలే అవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా, ఈ మూవీలోని సాంగ్ లీక్ అయ్యి నెట్టింట వైరల్ అయ్యింది. సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేని టైమ్ లో లీక్స్ వస్తే సంతోషించాల్సిన ఫ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఫైర్ అవుతున్నారు.
లీకైన సాంగ్ ట్యూన్, లిరిక్స్ దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. శంకర్ ఈ సాంగ్ మీద 15కోట్లు ఖర్చు పెట్టాడని టాక్ ఉండగా, సాంగ్ మాత్రం ప్రైవేట్ ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ కంటే చీప్ గా ఉందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలో ఇంత చీప్ క్వాలిటీ సాంగ్ ఏంటని డైరెక్టర్ శంకర్ మీద కూడా మండి పడుతున్నారు. ‘జాబిలమ్మ జాకెటేసుకొచ్చింది’ అనే లిరిక్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సాంగ్ గేమ్ చెంజర్ సినిమా లోది కాదని, గుంటూరు కారం సినిమాలోదని కూడా టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ తమనే కావటంతో మహేష్ ఫ్యాన్స్ కూడా తమన్ ని టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాని ఊపేస్తున్న సాంగ్ ఏ సినిమాలోది, అన్నది క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు