Game changer: దిల్ రాజుకు ఆ భయం పట్టుకుందా?

Game changer:

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటి ‘గేమ్ ఛేంజర్‘. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శంకర్ షణ్ముగం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదలైనప్పటినుండే ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేయగా, లీకైన స్టిల్స్ ఓ రేంజ్ లో ఉండడంతో ఆడియన్స్ కూడా భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు.

దానికి మెయిన్ రీసన్ శంకర్ చాలా ఏళ్ళ తర్వాత ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా కావడం, అందులోను రామ్ చరణ్ కి ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తొలి సినిమా కావడంతో మెగా అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లేట్ అవుతున్న కొద్దీ నిర్మాత దిల్ రాజూ కి టెన్షన్ పెట్టుకుందిట. అదేంటంటే శంకర్ తాను తీసే సినిమాలను తన గ్రాండ్ గా తెరకెక్కిస్తాడో తెల్సిందే. ఒక్క పాటలో 7వండర్స్ చూపించిన ఘనత ఆయనది.

మొన్నటికి మొన్న 2.0 లో పాటకి 50కోట్లు ఖర్చు పెట్టాడని అన్నారు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో పాటలకే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఇక సినిమా కూడా షూటింగ్ కి గ్యాప్ ఇస్తూ చేస్తున్నారు. అందువల్ల సినిమాకి అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని దిల్ రాజు ఫీలవుతున్నాడట.

- Advertisement -

గేమ్ చేంజర్ బడ్జెట్ 150 కోట్లనుకుని స్టార్ట్ చేస్తే ఇప్పుడు 300కోట్లు దాటేలా ఉందని అంటున్నారు.మామూలుగా శంకర్ సినిమాలు ఎప్పుడైనా సరే అనుకున్న బడ్జెట్ కి ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. ఒకవేళ పొరపాటున తక్కువ అయినా కూడా దాన్ని ప్రమోషన్స్ లో కవర్ చేస్తాడు శంకర్. మరి శంకర్ దిల్ రాజు చేత సినిమా రిలీజ్ అయ్యే లోపల ఎంత ఖర్చు పెట్టిస్తాడో.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు