Mega Family: రెండు కుటుంబాలను కలిపిన ఘనత ఆ ఇద్దరిదే..!

Mega Family

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్య ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడంటే ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమయ్యాయి కానీ, అప్పట్లో ఏ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఒక చోట చేరిన ప్రతిసారి ఒక మినీ యుద్ధమే జరిగేది. టాలీవుడ్లో ముఖ్యంగా నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య రైవల్రీ పీక్స్ లో ఉండేది.
అయితే, జెనరేషన్స్ మారే కొద్దీ ఫ్యాన్స్ ఆలోచనా తీరులో మార్పు వచ్చింది. ఈ మార్పును గమనించిన డైరెక్టర్ రాజమౌళి రెండు ఫ్యామిలీల హీరోలను కలిపే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం నుండి పుట్టిన ఆలోచనే RRR సినిమాకి నాంది పలికింది.
RRR సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య వైరం కాస్త తగ్గిందనే చెప్పాలి. ఫ్యాన్స్ మాట పక్కన పెడితే, ఎన్టీఆర్ రామ్ చరణ్ లు సినిమా ప్రమోషన్స్ సమయంలో ఫ్రెండ్లీగా మూవ్ అయిన విధానం చుస్తే ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అన్న ఫీలింగ్ కలిగింది. తాజాగా ఏపీ రాజకీయాల పుణ్యమా అని మరోసారి నందమూరి, మెగా ఫ్యామిలీలు ఒక తాటి పైకి వచ్చిన సంఘటన రిపీట్ అయ్యింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి నుండి బాబుకి మద్దతుగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్లి బాబుకి సంగీభావం ప్రకటించటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని కన్ఫార్మ్ చేసాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా ఉండటం విశేషం. నేపథ్యంలో రెండు ఫ్యామిలీలను కలిపినా ఘనత రాజమౌళి, జగన్ లకే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు