Naga Chaitanya’s Marriage: అన్ని మర్చిపోయి… ఫైనల్‌గా పెళ్లి పీటలెక్కబోతున్న నాగ చైతన్య?

Naga Chaitanya’s Marriage

ఈ మధ్య కాలంలో అక్కినేని నాగ చైతన్య ఏ సినిమా చేస్తున్నాడు? దానికి ఎవరు డైరెక్టర్? హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నలకంటే, చైతన్య ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అనే ప్రశ్ననే ఎక్కువగా వినిపిస్తుంది. సమంతతో డైవర్స్ తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కొత్త జీవితం స్టార్ట్ చేయడం లేదు ఏంటి? ఇంకా సమంతను నాగ చైతన్య మర్చిపోలేదా? అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఈ ప్రశ్నలను అన్నింటికీ నాగ చైతన్య సమాధానం చెప్పబోతున్నాడు.

త్వరలోనే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కింగ్ నాగార్జున కోరిక మేరకు నాగ చైతన్య రెండో పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇంకా ప్రేమ వ్యవహారాల గురించి ఆలోచించకుండా తండ్రి చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడని టాక్.

ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని ఓ బిజినెస్ ఫ్యామిలీతో నాగార్జున తన ఇంటికి కోడలిగా తీసుకురావాలని సమంతతో డైవర్స్ తర్వాత నుంచి ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే, బిజినెస్ లో బాగా సెటిల్ అయిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్తేను అక్కినేని ఇంటికి కోడలిగా చేసుకోబోతున్నాడట. దీనికి నాగ చైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో అక్కినేని వారి ఇంట మరి కొన్ని రోజుల్లోనే పెళ్లి బాజా వినిపించబోతుంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు