Naga Chaitanya’s next movie: చందు – నాగచైతన్య సినిమా కథ ఏంటంటే..?

Naga Chaitanya’s next movie

అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ), డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో జిఎ2 బ్యానర్ పై సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అయితే అనౌన్స్ అయ్యింది కానీ, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, స్టోరీ ఏంటి అన్న ఇతర వివరాలు మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా మత్స్యకారుల జీవితాల బ్యాక్డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడని, ఇందుకోసం డైరెక్టర్ చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసులతో కలిసి ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న యూనిట్ అక్కడి మత్స్యకారుల జీవన స్థితిగతుల గురించి రీసర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ చందు ఈ సబ్జెక్ట్ మీద చాలా డెప్త్ గా అధ్యయనం చేస్తున్నాడట. ప్రస్తుతం మత్స్యకారుల జీవితం ఎలా ఉంది, ఇంతకముందు ఎలా ఉండేది, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి వంటి అంశాల గురించి అక్కడి మత్స్యకారులను అడిగి తెలుసుకుంటున్నారట. నిర్మాత బన్నీ వాసు కూడా గతంలో అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రతి సబ్జెక్ట్ ని డెప్త్ గా రీసర్చ్ చేసే చందు ఈ సబ్జెక్ట్ మీద కూడా అంతే రీసర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న సినిమాలో సముద్రం బ్యాక్డ్రాప్ లో యాక్షన్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ మధ్యకాలంలో వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న నాగచైతన్యకి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు