BRO Movie Collections: పవన్ కళ్యాణ్… ట్రెండ్ సెట్టర్

BRO Movie Collections

“నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను..” ఈ డైలాగ్ ఎవరిదో తెలుసుకదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో చెప్పిన ఈ డైలాగ్ ఆయనకు సరిగ్గా సెట్ అవుతుంది. ఇటు సినిమాల్లో గానీ, అటు రాజకీయాల్లో గానీ పవన్ తన స్టైల్‌లో చేసే పనులో ట్రెండ్ సెట్ చేసేలా ఉంటాయి. అందుకే పవన్‌ను ట్రెండ్ సెట్టర్ అంటారు. తాజాగా మరోసారి ఆయనను ట్రెండ్ సెట్టర్ అని అంటున్నారు. ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ నుంచి లెటెస్ట్‌గా వచ్చిన చిత్రం బ్రో. ఈ మూవీ జస్ట్ త్రీ డేస్ లోనే 100cr కలెక్షన్లను సాధించింది. అయితే మూవీ యూనిట్ నుంచి 100 cr పోస్టర్ ను మాత్రం అఫిషీయల్ గా రాలేదు. ఇంతకు ముందు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమాల కలెక్షన్ల గురించి ఎప్పటికప్పుడు పోస్టర్స్ తో చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా 100cr కలెక్షన్లను ఇంత ఫాస్ట్‌గా అందుకున్నా, ఒకటి అంటే ఒక్క పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేరు. దీనికి కారణం పవన్ కళ్యాణ్.

తన సినిమాలకు వచ్చే కలెక్షన్ల గురించి పోస్టర్స్ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పారట. అందుకు ప్రోడక్షన్ హౌస్ నుంచి కలెక్షన్ల పరమైన పోస్టర్లు రావడం లేదు. అయితే కలెక్షన్ల గురించి బయటికి చెప్పాల్సిన అవసరం లేదని, ఇది అంత మంచింది కాదని మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్టార్ట్ చేశాడు. తర్వాత అందరూ స్టార్ హీరోలు ఇది ఫాలో అవుతారని కూడా అంచనా వేస్తున్నారు. అలా.. పవన్ కళ్యాణ్ మరోసారి ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్టర్ అయిపోయారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు