Powerstar’s Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి పవన్ కండిషన్స్..!

Powerstar’s Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా ఇటీవలే రిలీజ్ అవ్వగా, సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ఓజి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, అప్పుడెప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఆ తర్వాత మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కి మాత్రం బ్రేక్ పడింది. హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ అటకెక్కిందన్న టాక్ వినిపిస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. అయితే, హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఒక కండిషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కోసం 30రోజులు మాత్రమే కేటాయిస్తానని అన్నాడట. ఈ 30రోజుల్లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ కి కండిషన్ పెట్టాడట పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళేలోగా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

పవర్ స్టార్ తో సినిమా చేయటం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ కి 30రోజుల్లో షూట్ ని పూర్తి చేయగలడని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ కి ముందే ఈ సినిమా రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. మరి, అన్నీ సవ్యంగా సాగితే, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ పూర్తయ్యి అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు