Extra-First Single Out Now: హ్యారిస్ జయరాజ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా..

Extra-Ordinary Man First Single Out Now

హ్యారిస్ జయరాజ్ సంగీతానికి ముగ్దులు కానీ మ్యూజిక్ లవర్ ఎవరు ఉండరనే చెప్పాలి. ఇతర మ్యూజిక్ డైరెకర్ల డామినేషన్ వల్లనేమో లేకపోతే వరుస పెట్టి సినిమాలు చేయకపోవటం వల్లనో ఏమో కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల కాలంలో కనుమరుగయ్యారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన హ్యారిస్ జయరాజ్ చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.

వక్కంతం వంశి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలోని మొదటి పాటను నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు మేకర్స్. డేంజర్ పిల్ల అంటూ సాగె ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాట ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. మోస్ట్ హప్పెనింగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో నితిన్ కు జోడిగా నటిస్తుండగా, ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం ప్లస్ అయ్యే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి.

మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా తరువాత హ్యారిస్ జయరాజ్ తెలుగులో ఏ సినిమా చేయలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ సినిమా ఫ్లాప్ అవడంతో హ్యారిస్ జయరాజ్ కెరీర్ కు బ్రేక్ పడింది. మళ్ళీ ఇన్నిరోజులకు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు తన సంగీత మాధుర్యాన్ని రుచి చూపించడానికి రెడీ అయ్యాడు. డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో హ్యారిస్ జయరాజ్ మళ్ళీ ట్రాక్ లోకి రాబోతున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు