Chiranjeevi Latest Movie Buzz : మెగాస్టార్.. రీమేక్ స్టార్

Chiranjeevi Latest Movie Buzz

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కథలు కరువయ్యాయా? ఆయనకు కొత్త కథలు పుట్టడం లేదా? లేక కొత్త కథలను వినాలనే ఇంట్రెస్ట్ ఆయనకే లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మెగా స్టార్ ప్రస్తుతం వైఖరి ని బట్టి చెప్పాలంటే అవుననే సమాధానమే చెప్పాలి. గతకొద్ది కాలంగా స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న మెగా స్టార్ లేటెస్ట్ గా మరో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు రీమేక్ చేసిన చిరు మరో రీమేక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగా అభిమానులను కలవర పెడుతుంది.

మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల అవబోతుండగా.. అప్పుడే ఆయన తరువాతి సినిమా పనులను కూడా మొదలు పెట్టాడు చిరంజీవి. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా ప్లానింగ్ దశలో ఉంది.

- Advertisement -

భోళా శంకర్ సినిమాతో రీమేక్ ల గోల అయిపోయిందనుకుంటే, ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో చేసే సినిమాలో చేసే సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడి మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారనే ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి, కొడుకు రోల్ శర్వానంద్, మథర్ గా త్రిష, చిరు కోడలు క్యారెక్టర్ ని శ్రీలీల చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

అయితే చిరు ఇలా బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ సినిమాలు చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మెగాస్టార్ రేంజ్ కు స్ట్రయిట్ సినిమాలు చేసి, ఇతర హీరోలకు స్ఫూర్తిగా ఉండకుండా, ఆయనే రీమేక్ సినిమాలు చేయడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చటం లేదు. చిరంజీవి పై ఉన్న అభిమానికి అడ్డొచ్చి, పైకి ఎవరు దీని గురించి మాట్లాడకపోయినా లోలోపల మాత్రం ఇంకెన్ని రీమేక్ సినిమాలు చేస్తాడని గుస గుసలాడుతున్నారు.

అయితే ఈ రీమేక్ పై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషీయల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. భోళా శంకర్ రిలీజ్ తరువాత ఈ న్యూస్ పై క్లారిటీ ఇవ్వనున్నట్టు టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు