Brahmāstra latest bazz:హరోంహర అత్తిలి చిరబర- బ్రహ్మాస్త్ర-2 ఇక లేదు?

Brahmāstra Part two latest bazz

రియల్ లైఫ్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అయిన గుర్తుండ లేకుండా ఎలా ఉంటుందిలెండి.. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ టైం బాలీవుడ్ మీడియా చేసిన హడావిడి అలాంటిది మరి, విషయం వీక్ గా ఉన్నపుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుందనే అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ ను గుర్తు చేసేలా, బ్రహ్మాస్త్ర మూవీ రిలీజప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసారు ఈ యూనిట్.

ఇక అసలు విషయానికొస్తే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్… లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళే సూపర్ హిట్ మూవీ అంటూ ప్రకటించుకున్నారు, కానీ రియాలిటీలో చూస్తే, అసలు వ్యవహారమే వేరు. బ్రహ్మాస్త్ర సినిమా కొన్న బయ్యర్లులతో పాటు ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా భారీగానే నష్టపోయారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీని సక్సెస్ అయిందని ప్రేక్షకులను నమ్మించడానికి పెట్టిన ఖర్చులో సగం కంటెంట్ పై పెట్టి ఉంటె ఇలా జరిగేది కాదని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ఇదంతా పక్కనే పెడితే, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ రిలీజ్ కాకముందే, ఈ మూవీని మొత్తం మూడు పార్ట్‌లుగా విడుదల చేస్తామని డైరెక్టర్ అయన్ ముఖర్జీ అనౌన్స్ చేశాడు. పార్ట్ వన్ క్లైమాక్స్‌లో పార్ట్ 2కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పుడు చూస్తే బ్రహ్మాస్త్ర 2 రావడం దాదాపు కష్టమేనట.

- Advertisement -

నిర్మాత కరణ్ జోహర్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. మళ్లీ వందల కోట్ల బడ్జెట్ పెట్టి బ్రహ్మాస్త్ర చేయడానికి ముందుకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాలు చేస్తూ ఉన్నాడే తప్పా.. బ్రహ్మాస్త్ర పార్ట్2 గురించి కనీసం ఆలోచించడం సమాచారం అందుతోంది. ఇక చేసేదేమి లేక డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మాస్త్రను పక్కన పెట్టి వేరే సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్టు బీ టౌన్ లో వినిపిస్తుంది.

మొత్తంగా చూస్తే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ఆగిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు