Jailer trailer side effects : రజినీపై తమన్నా ఫ్యాన్స్ ఫైర్

Jailer trailer -side effects

మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం లస్ట్ బ్యూటీగా మారి వరుసగా ఛాన్స్ లను కొట్టేస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీగాా ఉన్న తమన్నాకు జైలర్ సినిమా ప్రత్యేకం. ఎందుకంటే, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ అంత ఈజీగా ఎవరికీ రాదు. అలాంటి ఛాన్స్ ఇప్పుడు తమన్నా చేతిలో ఉంది. ఈ సినిమా హిట్ అయితే అందరికీ కంటే కలిసొచ్చేది తమన్నాకు మాత్రమే.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన “కావాలయ్యా…” సాంగ్ సూపర్ హిట్ అయింది. మూవీలో తమన్నా క్యారెక్టర్ కి ప్రేయారిటీ ఎక్కువనే అని అంతా అనుకున్నారు. కానీ, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో చూస్తే తమన్నా అసలు కనిపించలేదు. ట్రైలర్ మొత్తం రజినీకాంత్ స్వాగ్, స్టైల్ చూపించారు. అంతే కానీ, మెయిన్ హీరోయిన్ గా ఉన్న తమన్నాకి సంబంధించిన సీన్ ఒకటి అంటే ఒక్కటి కూడా లేదు.

దీంతో రజినీకాంత్‌పై తమన్నా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. హీరోయిన్‌ని చూపించకుండా ట్రైలర్ ఎలా కట్ చేస్తారు అంటూ మూవీ యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక ట్రైలర్ వచ్చిందంటే, మెయిన్ కాస్ట్ ని చిన్న సీన్ లో అయినా చూపిస్తారు. కానీ, జైలర్ ట్రైలర్ మొత్తం రజినీకాంత్ ని స్టైలీష్‌గా చూపించడానికే యూజ్ చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

అసలే తమన్నా కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉంది. ఆఫర్స్ లేక చేతికందొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతున్న తమన్నాకి జైలర్ సినిమా తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాగ ఉపయోగపడుతుందనుకుంటే ట్రైలర్ చూస్తే అలా జరిగేలా లేదని స్పష్టమైంది.ట్రైలర్ లోనే తమన్నా ఒక్క షాట్ లో కూడా లేదంటే.. ఇక సినిమాలో ఏముంటుంది అనే అనుమానాలు వస్తున్నాయి. ఆగస్ట్ 10న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో మరి తమన్నా పాత్ర ఎంత మాత్రం ఉంటుందో వేచి లేక కావాలయ్యా అనే పాటకు మాత్రమే పరిమితమితవుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు