Nandamuri family : బాలయ్య భార్య వసుంధర హ్యాండ్ అంత లక్కీనా..!

Nandamuri family

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దివంగత నటుడు, ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 11 మంది సంతానంలో బాలకృష్ణ చిన్న కొడుకు. బాలకృష్ణ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ తన కెరీర్ లో ఇప్పటివరకు 107 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం జరిగింది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి.

ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని.. అలాగే ఒక కుమారుడు మోక్షజ్ఞ తేజ జన్మించారు. వందల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన వసుంధర పెళ్లి తర్వాత ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ వ్యవహారాలు అన్నింటిని తన భుజాన వేసుకున్నారు. భర్తకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలిచారు. అయితే తాజాగా బాలయ్య భార్య వసుంధర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధరది గోల్డెన్ హ్యాండ్. ఆమె చేత్తో ఎవరికైన డబ్బులు ఇస్తే బాగా కలిసి వస్తుందన్న ఓ సెంటిమెంట్ ఉంది.

బాలయ్యతో సినిమా చేసే నిర్మాతలు ముందుగా వసుంధర దగ్గరకు వచ్చి ఆమె చేత్తో లక్ష రూపాయలు తీసుకుంటారట. ఆమె చేతి నుండి డబ్బులు తీసుకుంటే కలిసివస్తుందని ఇండస్ట్రీలో సైతం కొందరు నమ్ముతారట. ఇక ఇంట్లో కూడా ఏ పని ప్రారంభించినా వసుంధర దేవి చేతుల మీదనే డబ్బు తీసుకుంటారట. బాలయ్య బయటకు వెళ్లే ముందు వసుంధర ఖచ్చితంగా ఎదురు వెళ్తారట. ఇది బాలయ్య భార్య వసుంధరకు ఉన్న గోల్డెన్ హాండ్స్ సెంటిమెంట్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు