Excusive -Unknown fact : 29 ఏళ్ల క్రితం ఆ విమాన ప్రమాదం టాలీవుడ్ ని బ్రతికించింది..!

 Excusive -Unknown fact

జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అలాంటి ఘటనలు గుర్తుతెచ్చుకుంటే మనకు తెలియకుండానే వణుకు పుడుతుంది. అచ్చం ఇలాంటి ఘటనే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల జీవితంలోనూ జరిగింది. విమాన ప్రమాదం అంటే సాధారణంగా బతికి బట్టకట్టడం జరిగే పని కాదు. విమానం ఎక్కడ క్రాష్ అయినా లేదా ఇంజన్ లో లోపం సంభవించినా ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి ఘటనే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల జీవితంలో జరిగింది.

1993 నవంబర్ 15న జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ వణుకు తెప్పిస్తోంది. 29 సంవత్సరాల క్రితం మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ప్రయాణిస్తున్న ఓ విమానం ప్రమాదానికి గురైంది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమిళనాడులో ఉండే రోజుల్లో అక్కడే ఎక్కువ షూటింగ్స్ జరిగేవి. అప్పటి మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి ఓ విమానం బయలుదేరింది. దీపావళి పండుగ నిమిత్తం స్టార్ హీరోలు, తెలుగు సినిమా తారలు, ఇతర ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మొత్తంగా 262 మందితో కలిసి ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ బస్ A300 బయలుదేరింది.

ఆ విమానం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ కావలసి ఉంది. అయితే హైదరాబాద్ వచ్చేసరికి వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆ విమానాన్ని మళ్లీ మద్రాస్ వైపు తరలించారు. కానీ ఫ్యూయల్ సమస్యతో అక్కడి వరకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ విమానాన్ని క్రాష్ లాండింగ్ చేసేసాడు పైలట్. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. అయితే లాండింగ్ సమయంలో కాస్త అటు ఇటు అయినా పెద్ద ప్రమాదమే జరిగేది. తడిగా ఉన్న పంట పొలాల్లోనే విమానాన్ని లాండింగ్ చేశారు. ఈ అతి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ వారిలో చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, విజయశాంతి, కోడి రామకృష్ణ, సుధాకర్, దర్శకుడు బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి, ఇలా చాలామంది ప్రముఖులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆ విమానంలో ప్రయాణించారు. ఓ రకంగా ఇది వీళ్లకు పునర్జన్మ అని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు