Mrunal thakur initial struggles : సూసైడ్ అటెంప్ట్ చేసిన మృణాల్ ఠాకూర్ ?

Mrunal thakur initial struggles

మృణాల్ ఠాకూర్… అంటే తెలియకపోవచ్చు… కానీ సీతారామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియన్స్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం 2022 ఆగస్టు 5న విడుదల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో మృణాల్ తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

ఈ మధ్యనే మృణాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది. సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ‘హాయ్ నాన్న’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్గా విడుదల కానుంది. మరాఠీ, హిందీ సీరియల్స్ నటిస్తుండగా అమ్మడికి సినిమాల్లో చేయాలని బాగా కోరిక ఉండేదట. హీరోయిన్ అయిపోవాలని కలలు కనేదట.

ఈ క్రమంలోనే ప్రయత్నాలు చేస్తుండగా చాలామంది నీకేం నటన వస్తుందని హేళనగా మాట్లాడేవారట. నువ్వు సీరియల్ యాక్టర్ వి హీరోయిన్ అయిపోదామని కలలు కంటున్నావా అంటూ చాలా చీప్ గా చూసేవారట. ఈ అవమానాలను భరించలేక సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. కానీ ఇండస్ట్రీలో దశాబ్దం పాటు పోరాటం చేసి సీతారామం సినిమాతో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో మృణాల్ ఠాగూర్ కెరీర్ లో తిరిగి చూసుకునే పనిలేని విధంగా దూసుకుపోయింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు