RAPO’s Double Ismart: సంజయ్ దత్ కి షాకింగ్ రెమ్యునరేషన్..!

RAPO’s Double Ismart

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ( Sanjay Dutt ) సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌత్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ సినిమాలో విలన్ రోల్ లో నటించి మెప్పించిన సంజయ్ ప్రస్తుతం పూరి – రామ్ ల కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్, విజయ్ – లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్లో వస్తున్న లియో సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ రెండు సినిమాలకు సంబంధించి సంజయ్ లుక్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటించేందుకు సంజయ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేశాడని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం 60రోజులు కేటాయించిన సంజూ భాయ్, 15కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట.

లైగర్ సినిమా ద్వారా ఘోర డిజాస్టర్ అందుకున్న ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలన్న కసితో ఉన్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ కి కూడా ఇటీవల చెప్పుకోదగ్గ హిట్ లేని నేపథ్యంలో ఈ సినిమా కీలకంగా మారింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను 2024 మార్చ్ 8న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇటీవలే బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

మొత్తానికి విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయిన సంజూ భాయ్ కెజిఎఫ్ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసాడు. ఇస్మార్ట్ శంకర్ కి ముందు కూడా రామ్ కి సరైన హిట్ లేని నేపథ్యంలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు