Superstar’s Jailer: జైలర్ ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా..?

Superstar’s Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ ( RajiniKanth ), డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో రూపొందిన జైలర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. రిటైర్డ్ ఆఫీసర్ గా నటించిన రజినీకాంత్ లుక్స్, స్వాగ్ ట్రైలర్ హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని అనిపిస్తున్న ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాలీవుడ్ సినిమా ‘నోబడి’ ( Nobody ) సినిమా కథకి, జైలర్ సినిమా కథకి పోలిక ఉన్నందున జైలర్ ఆ సినిమాకి ఫ్రీమేక్ అన్న కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో.

జైలర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాష సినిమాకి దగ్గరగా ఉందంటూ కామెంట్స్ వచ్చినప్పటికీ, హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అన్న కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. నోబడి సినిమాలో కూడా హీరో ఒక రిటైర్డ్ ఏఫ్బీఐ ఆఫీసర్ అవ్వడం, జైలర్ లో కూడా రజినీకాంత్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ అవ్వటంతో నోబడి సినిమాకి కాపీ అని డిసైడ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే సినిమా యూనిట్ నుండి రెస్పాన్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికి ట్రైలర్ తో అంచనాలు పెంచిన జైలర్ సినిమా మెగాస్టార్ భోళాశంకర్ సినిమాకి గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాకి కాపీ అంటూ వస్తున్న వార్తలు సినిమాకి ఏమైనా డ్యామేజ్ చేస్తాయా అన్న ఆందోళన నెలకొంది సూపర్ స్టార్ అభిమానుల్లో. రజినీకి జోడిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. మరి, ఇండిపెండెన్స్ డే సందర్బంగా బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల మధ్య ఏర్పడ్డ పోటీలో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు