Naga Chaitanya New Movie: రౌడీ హీరోపై నాగ చైతన్య రివేంజ్ ప్లాన్… ఈ సారి మామూలుగా ఉండదు

Naga Chaitanya New Movie

సమంత ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా, నాగ చైతన్య మాజీ భార్య అనే పేరు మాత్రం పోవడం లేదు. సమంత నుంచి ఎలాంటి సినిమా వచ్చినా, అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా, నాగ చైతన్య మాజీ భార్య మూవీ రిజల్ట్ ఇలా ఉంది అంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. తాజాగా సమంత ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో విజయ్ – సమంత కెమిస్ట్రీ గురించి ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. లిప్ లాక్ సీన్స్ గానీ, ఓ సందర్భంలో వచ్చే బెడ్ రూం సీన్ లో గానీ, సామ్, విజయ్ ఫర్మామెన్స్ పై విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే అక్కినేని వారి మాజీ కోడలుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాగానే ఏంజాయ్ చేశాడు అంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

మీమర్స్ ఇప్పటికి కూడా సమంతను నాగ చైతన్య మాజీ భార్య గానే చూస్తూ మీమ్స్ వేస్తున్నారు. ఈ మీమ్స్ అక్కినేని హీరో నాగ చైతన్య ఇబ్బందిగా మారుతున్నాయట. కాగా, సామ్ ఎంతైన చైతన్యకి మాజీ భార్య. సామ్‌తో విజయ్ దేవరకండ చేసిన రొమాన్స్ చూసి చైతన్య తట్టుకోలేకపోతున్నాడని తెలుస్తుంది. తన మాజీ భార్యతో రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండపై రివెంజ్ ప్లాన్ చేశాడట నాగ చైతన్య. ఈ అక్కినేని హీరో నుంచి రాబోయే సినిమాలో హీరోయిన్ గా విజయ్ దేవరకొండ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని మూవీ యూనిట్‌ని కోరతున్నాడని సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం నాగ చైతన్య తన కొత్త మూవీ చందు మొండేటితో చేస్తున్నాడు. దీని తర్వాత ఉండబోయే సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేసే అవకాశం ఉంటుందట. అంతే కాదు, ఇప్పటి వరకు నాగ చైతన్య చేయలేని రొమాంటిక్ బాయ్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉండబోతుందని తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు